బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో అంచనాలతో వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమా చెన్న కేశవ రెడ్డి. ఈ సినిమా బాలయ్య కెరీర్ లో చాలా మందికి నచ్చినా సరే థియేటర్ లో మాత్రం ఎవరూ కూడా చూసే ప్రయత్నం చేయలేదు. టీవీ లో వస్తే మాత్రం మిస్ అవకుండా చూస్తూ ఉంటారు. ఈ సినిమాలో ఆయన నటన కథ అన్నీ బాగున్నా సరే సినిమా క్లైమాక్స్ విషయంలో మాత్రం జరిగిన తప్పులు సినిమాను బాగా ఇబ్బంది పెట్టాయి. అప్పటి వరకు ఒక రేంజ్ లో సినిమాను తీసుకుని వెళ్లి ఆఖర్లో చెడగొట్టారు అని చాలా మంది కామెంట్స్ చేసారు అప్పట్లో. 

 

ఇక ఈ సినిమాలో బాలయ్య నటన గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అది అలా ఉంటే ఈ సినిమాలో ఉండే రాజకీయ కోణం మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటుంది. బాలకృష్ణ ను ఎదుర్కోవడానికి గానూ రాజకీయ నాయకులు అందరూ ఒకటి కావడం, విలన్ కుటుంబానికి సహకరించడం వంటి కోణాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య ను ఎదుర్కోవడానికి గానూ రాజకీయ నాయకుడు, లాయర్ అదే విధంగా పోలీస్ లు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సినిమా తర్వాత బాలయ్య  ఇక ప్రయోగాల విషయంలో కాస్త భయపడ్డారు. 

 

ఇప్పుడు కూడా ఆయన ప్రయోగాలు చేసే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించి అప్పుడు ఓకే చేస్తున్నారు. అయితే ఫ్యాక్షన్ సినిమాల విషయంలో మాత్రం ఆయన గతం లో మాదిరిగా దూకుడు చూపించిన సందర్భం లేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే బాలయ్య ఇప్పుడు  బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: