మహేష్ బాబు కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి ఆ అంచనాలను అందుకున్న సినిమా దూకుడు. ఈ సినిమా చాలా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కెరీర్ లో ఇక వెనక్కు తిరిగి చూసుకునే అవసరం రాలేదు అనే చెప్పాలి. ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా మహేష్ బాబు ని కమర్షియల్ హీరో గా మార్చి మంచి వసూళ్లు సాధించే విధంగా వచ్చింది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో మహేష్ నటన తో పాటుగా ప్రకాష్ రాజ్ నటన ఇతర నటుల నటన చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. 

 

ఇక ఈ సినిమాలో ఉన్న రాజకీయ కోణం చాలా  బాగా ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఎమ్మెల్యే గా ఉంటారు. ఆయనకు ప్రజా సేవ అంటే పిచ్చి. ఇక దాని ఆధారంగా సినిమా ఉంటుంది. మహేష్ బాబు తన తండ్రిని చంపాలని కొందరు కుట్ర చేసి ప్రమాదం చేయడం ఆ తర్వాత మహేష్ తన తండ్రిని బ్రతికిన్చుకోవాలి అని ఎమ్మెల్యే గా నటించడం అసెంబ్లీ ని చూపించడం వంటివి సినిమాలో బాగా ఆకట్టుకున్న విషయాలు. ఇక ఎమ్మెల్యే గా ప్రజలకు న్యాయం చెయ్యాలి అని ఇంటి దగ్గర పంచాయితీ లు పెట్టడం వంటివి కూడా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. 

 

ఇక ఇప్పుడు మహేష్ బాబు మరోసారి రాజకీయ నాయకుడి గా నటిస్తున్నారు అనే టాక్ వినపడుతుంది. ఆయన సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ సినిమాకు  నిర్మాత గా మహేష్ బాబు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన రాజకీయ నాయకుడి గా నటిస్తున్నారు మరో సారి అనే టాక్ వినపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: