శర్వానంద్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ప్రస్తానం. ఈ సినిమా మొత్తం కూడా రాజకీయ నేపధ్యం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు కూడా రాజకీయ నేపధ్యమే ఈ సినిమాలో  కనపడుతుంది. ఈ సినిమాలో సాయి కుమార్ నటన ఒక రేంజ్ లో ఉంటుంది అని సినిమా చూసిన ఎవరు అయినా సరే ప్రత్యేకంగా చెప్పే మాట. ఈ సినిమాలో ఆయన ఒక రాజకీయ నాయకుడి గా నటించడమే కాదు ఆయన విలన్ కూడా. కనపడని విలన్ పాత్రను ఆయన పోషించే ప్రయత్నం చేస్తారు.

 

ఇక తన తండ్రి మరణించిన వెంటనే శర్వానంద్ సాయి కుమార్ చేయి పట్టుకుని తిరిగి అక్కడి నుంచి ఆయనే తన తండ్రి అని నమ్మి ప్రస్తానం మొదలు పెడతాడు. ఈ సినిమాలో ఉండే డైలాగులు గాని ఈ సినిమాలో ఉండే నటన  గాని అన్నీ కూడా సినిమాకు స్పెషల్ గా నిలిచాయి అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత శర్వానంద్ కి నటుడి గా మంచి పేరు వచ్చింది. అయినా సరే అతను మాత్రం దానిని సరిగా నిలబెట్టుకునే విషయంలో ఘోరంగా విఫలం అయ్యాడు అని అంటారు. ఈ సినిమాలో ఒక నాయకుడి గా ఎదగడానికి గానూ ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా కుట్రలు చేస్తాడు అనేది స్పష్టంగా చూపిస్తాడు దర్శకుడు దేవా కట్టా. 

 

సినిమా తర్వాత అలాంటి సినిమా మళ్ళీ రాలేదు. అలాంటి సినిమా కోసం కూడా ప్రేక్షకులు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా మాస్ ని అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. అందుకే సినిమా ఫ్లాప్ అయింది అనే విషయం చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ సినిమాలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే దాని రేంజ్ మరోలా ఉండేది.

మరింత సమాచారం తెలుసుకోండి: