రజనీ కాంత్ శంకర్ దర్శకత్వంలో సినిమా అనగానే చాలా మందికి ఒక క్రేజ్ అనేది ఉంటుంది. సినిమా ఏ విధంగా ఉంటుంది ఏ కోణం లో వస్తుంది అనేది చాలా విధాలుగా ఎదురు చూస్తారు. సినిమా మొదటి నుంచి కూడా చివరి వరకు ప్రతీ సీన్ కూడా మిస్ అవకుండా చూస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే వీరి కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా శివాజీ. వీరి కాంబినేషన్ లో ఈ సినిమా ఒక సంచలనం అనే చెప్పాలి. శివాజీ గా రజనీ కాంత్ నటన ఆస్తి ఉన్నా సరే అతను చేసే పోరాటం అన్నీ కూడా సినిమాలో హైలెట్ గా ఉంటాయి. 

 

ఇక ఈ సినిమాలో విలన్ గా నటించిన వ్యక్తి రాజకీయ నాయకుడు కావడం, రాజకీయ నాయకులు అందరి మీద అతను పోరాటం చేయడం సినిమాలో హైలెట్ గా నిలిచిన సీన్ లు అనే చెప్పాలి. ఈ సినిమాలో బాగా ఆకట్టుకుంది రాజకీయ కోణమే. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు అందించే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. ఈ సినిమా ఆల్ ఇండియా వైడ్ గా మంచి విజయం సాధించింది కూడా. ఇక శివాజీ తర్వాత రజని కాంత్... శంకర్ కాంబినేషన్ లో ఏ సినిమా వచ్చినా సరే జనాలకు అది తెలియని క్రేజ్ ని తీసుకొచ్చింది అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత రజనీ కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేసినా సరే అవి ఫెయిల్ అయ్యాయి. 

 

ఆయన కెరీర్ లో అక్కడి నుంచి హిట్ అయిన సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.  ఒక్క రోబో సినిమా మినహా ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: