శ్రీకాంత్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా ఆపరేషన్ దుర్యోదన. ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది. ఈ సినిమాలో అతని నటన నుంచి ప్రతీ ఒక్కటి కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అతను ఎమ్మెల్యే అవ్వాలి అని ప్రయత్నాలు చేయడం అక్కడి నుంచి అతను చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఇక అతను చేసిన ఎన్నికల ప్రచారం కూడా సినిమాల్ హైలెట్ గా ఉంటుంది. అప్పటి వరకు ఎవరూ కూడా ఆ విధంగా ఎన్నికల ప్రచారం చేయలేదు అనే చెప్పాలి. 

 

హైదరాబాద్ కి ఓడరేవు తీసుకుని వస్తా అని అతను సినిమాలో ఒక హామీ ఇస్తాడు. దానికి మంచి స్పందన వస్తుంది. అదే విధంగా అవినీతికి సంబంధించి కూడా అతను చాలా హామీలు ఇస్తూ ఉంటాడు. ఇక అతను  తాను ఏంటీ అనేది చూపించుకోవడానికి చాలా బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలా ఈ సినిమాలో రాజకీయ కోణం అనేది ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమాలో అతని నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. గుండు తో కనిపిస్తాడు శ్రీకాంత్. ఇక తన భార్యా పిల్లల వద్ద కూడా అతను చాలా కొత్తగా ఈ సినిమాలో కనిపిస్తాడు. 

 

సినిమా తఃర్వాత అతనికి చాలా మంచి పేరు వచ్చింది గని అలాంటి సినిమాలను మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అని చూడటం ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది గా అనిపించింది. ఆ సినిమాను ఆదరించిన విధంగా మరో సినిమాను జనాలు ఆదరించలేదు అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత అతను విలన్ గా కూడా నటించే ప్రయత్నం చేసినా సరే అతనికి మంచి పేరు అనేది రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: