ఏంటి నిజమా? నిజంగానే చిరంజీవి పదవి వద్దన్నాడా? ఎందుకు వద్దన్నాడు ? ఎప్పుడు వద్దన్నాడు అని అనుకుంటున్నారా ? రియాలిటీలో కాదు లెండి.. సినిమాలో వద్దు అన్నాడు. అదే ముఠా మేస్త్రి సినిమాలో. రాజకీయాలలో చెత్త, కుళ్ళు అంత ఊడ్చేసాను.. మళ్లీ అలాంటి చెత్త ఉంటే తప్ప రాజకీయాలలోకి అడుగు పెట్టాను అని చెప్పి రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు ముఠా మేస్త్రి సినిమాలో. 

 

IHG

 

అవును.. అందుకే అప్పట్లో ఈ సినిమా హిట్ అయ్యింది.. ఇంకా ఈ సినిమాలో ఓ డైలాగ్ అయితే ఎంత హైలెట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ డైలాగ్ ఏంటంటే? ''స్పీడ్ అపామాకు స్టోరీ మార్చేస్తా'' అనే డైలాగ్ సూపర్ హిట్ అయ్యింది. ఇంకా ఈ సినిమాలో డైలాగులు, డ్యాన్సులు, అసెంబ్లీ సమావేశాల్లో వాదనలు అబ్బో.. చెప్పకూడదు లెండి. 

IHG

 

సినిమా తెలుసుగా, స్టెప్ మర్చిపోలేదుగా.. మన చిరంజీవి గారు మార్కెట్ లో ముఠా మేస్త్రిగా అలరించారు.. అప్పట్లో ఈ సినిమాలో చిరంజీవి వేసిన స్టెప్పులకు, డైలాగులకు ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా చూసి అప్పట్లో మేస్త్రీలు కాలర్ ఎగరేసి తిరిగేవారు. అబ్బా సినిమా ఎంత బాగుంది అనేవాళ్ళు. 

 

IHG

 

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ఈ సినిమా అదరగొట్టింది అంటే నమ్మండి. ఇప్పుడు భరత్ అనే నేను సినిమా, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలు వచ్చాయి.. కానీ అప్పట్లోనే అసెంబ్లీ సన్నివేశాలలో చిరంజీవి వాదించిన తీరు మాములుగా లేదు అంటే నమ్మండి.. అందుకే ముఠా మేస్త్రి సినిమా ఎవర్ గ్రీన్ అయిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: