2019 ఫిబ్రవరి 8వ తేదీన విడుదలైన యాత్ర సినిమాలో మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని ప్రధాన పాత్రల్లో నటించారు. దివంగత నేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాకి మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ఎలా పాదయాత్ర చేశారో, అతను తన రాజకీయ జీవితంలో ఎలాంటి ఇబ్బందులను,  బాధలను, కష్టాలను ఎదుర్కొన్నారో... ఆపై ముఖ్యమంత్రిగా పదవిని ఎలా అధిరోహించారో చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గురించి కూడా ఈ సినిమాలో చూపించబడింది.

IHG
వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన మమ్ముట్టి తన నటనా చాతుర్యంతో ప్రేక్షకులను బాగా అలరించారు అని చెప్పుకోవచ్చు. నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ఈ యాక్టర్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేశారు. యాత్ర సినిమాని తన భుజాల పైన వేసుకొని చివరి వరకు అద్భుతంగా నడిపించిన మమ్ముటి కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. నిజం చెప్పాలంటే యాత్ర సినిమా పూర్తిగా చూసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి ఒదిగి పోయినట్టు మరెవరూ ఒదిగిపోలేరేమో అనే ఫీలింగ్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో వస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఎమోషనల్ సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. రాజశేఖర్ రెడ్డి ఎంత గొప్ప వారో చాలా చక్కగా చూపించడంతో యాత్ర బయోపిక్ మూవీ కి ప్రేక్షకులు అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. 

IHG
వైయస్సార్ తండ్రి అయిన రాజా రెడ్డి పాత్రలో జగపతి బాబు చాలా బాగా నటించాడు. కెవిపి పాత్రలో నటించిన రావు రమేష్ కూడా ఇరగదీశాడని చెప్పవచ్చు. విజయమ్మ పాత్రలో నటించిన ఆశ్రిత వేముగంటి నటనకు ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫిదా అయిపోయారు అంటే అతిశయోక్తి కాదు. సబితా ఇంద్రారెడ్డి పాత్రలో నటించిన సుహాసిని కూడా ప్రేక్షకులను బాగా అలరించింది. చిన్న పాత్రలో నటించిన అనసూయ కూడా తనకి నటనలో ఉన్న సత్తా ఏంటో చూపించింది. మొత్తం పాజిటివ్ కోణంలో కొనసాగిన యాత్ర సినిమాలోని ప్రతి ఒక్క సన్నివేశం ప్రజల మనసులను గట్టిగా హత్తుకుందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: