తెలుగు చిత్ర పరిశ్రమలో  ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ.. ఎంత సంచలన విజయాలు సాధించినప్పటికీ... సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలు సృష్టించిన సంచలనాలు మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో సంచలనాలు సృష్టించడం ఏమో కానీ వివాదాలతో మాత్రం సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయి. ముఖ్యంగా రియలిస్టిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా తన సినిమాలు తెరకేక్కిస్తూ ఉంటారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. 

 


 ఇలా రాంగోపాల్ వర్మ ఇప్పటివరకు తెరకెక్కించిన ఎన్నో సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనమే సృష్టించాయి అని చెప్పాలి. అందుకే రామ్ గోపాల్ వర్మను సంచలనాల దర్శకుడు అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా నిజజీవితంలో వివాదాస్పదం గా మారి సంచలనం  సృష్టించిన కొన్ని సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తుంటారు  రామ్ గోపాల్ వర్మ. ఇలా తెరకెక్కించిన సినిమా ల లో ఒకటి రక్త చరిత్ర. రక్త చరిత్ర సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా... తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించింది.. 

 


 అంతేకాదు సంచలన విజయాన్ని కూడా అందుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా అప్పట్లో ఆంధ్ర రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేసిన వంగవీటి జీవిత  కథ ఆధారంగా తెరకెక్కింది. సినిమా మొత్తం పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో ఉండడమే కాదు... పగలు ప్రతీకారాలు ఎలా ఉంటాయి అని కళ్లకు కట్టినట్లు చూపించింది ఈ సినిమా. ముఖ్యంగా ఈ సినిమాలోని సంఘటనలన్నీ మన కళ్లముందే జరుగుతున్నాయేమో అనేంతలా  ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ప్రభావితం చేస్తుంది ఈ సినిమా. అసలుసిసలైన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది  రక్త చరిత్ర సినిమా. ఇక ఈ సినిమా ఒక పార్ట్  తోనే ఊరుకోకుండా ఏకంగా  రక్త చరిత్ర రెండు పార్టు లను  తెరకెక్కించారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ సినిమా ఇప్పటికీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనమే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: