తెలుగు చిత్ర పరిశ్రమలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలకు క్రేజ్ ప్రత్యేకంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు కూడా ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాల్లో నటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అసలుసిసలైన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ సినిమాగా వచ్చిన సినిమా ఎన్జికే.  తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా... పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో నే తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో నేటి తరం రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు అనేది చూపించారు దర్శకుడు. 

 


 ముఖ్యంగా ఒక సాదాసీదా వ్యక్తి గా ఉన్న సూర్య.. ఆ తర్వాత రాజకీయ నాయకులను ఆకర్షించి వారి పంచన చేరి... ఆ తర్వాత క్రమక్రమంగా ఏకంగా వాళ్ళని మించిపోయి ఎదగడం... ఈ క్రమంలోనే ఎదురయ్యే ఇబ్బందులు వీటన్నింటినీ ఎంతో ఆసక్తికరంగా చూపించారు ఈ సినిమాలో. నేటి తరం రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఎదగడానికి ఎలాంటి వ్యూహాలను పన్నుతున్నారు అనే విషయాన్ని కూడా ఎన్జీకే సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమాలు సూర్య నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది అనే చెప్పాలి. 

 


 సాయి పల్లవి కూడా తన పాత్ర మేర  బాగా నటించింది ఈ సినిమాలో . అయితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఎంతగానో అలరించినప్పటికీ... ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఈ సినిమా అంతగా విజయం సాధించలేక పోయింది అని చెప్పాలి. అయితే నేటి తరంలో యువత ఏవిధంగా ఆలోచిస్తున్నారు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏవిధంగా మారుతున్నారు అనే విషయాన్ని ఈ సినిమాలో దర్శకుడు స్పష్టంగా చూపించాడు అనే చెప్పాలి. కానీ ఎందుకు ఎక్కడో తేడా కొట్టేసి ఈ సినిమా మాత్రం అంతగా ప్రేక్షకుల ఆదరణ పొంద లేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: