పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్. టాలీవుడ్ లో ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలుగా వచ్చిన సినిమాలను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు. ఇలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి పోతూ ఉంటాయి. ఇక అటు స్టార్ హీరోలు కూడా ఇలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు తీయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే నిజజీవితంలో హీరోలు రాజకీయాలకు ఎంతో దూరంగా ఉన్నప్పటికీ సినిమాల విషయానికి వచ్చేసరికి కొన్ని కొన్ని సినిమాల్లో రాజకీయ నాయకులు లేదా రాజకీయ నాయకులను ఎదిరించే  వారు గా కనిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. 

 

 ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమాల్లో ఒకటి సైనికుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది, ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర లో బాలీవుడ్ దిగ్గజ నటుడు అయిన ఇర్ఫాన్ ఖాన్ నటించారు. ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది అని చెప్పాలి. మంచి విజయాన్ని కూడా అందుకుంది. ప్రజల పట్ల ఎంతో నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్న ఓ రాజకీయ నాయకున్ని  ఎదిరించి  పోరాడి ప్రజలకు న్యాయం జరిగేలా చేసేందుకు తపనపడే ఒక యువకుడి పాత్రలో నటిస్తాడు ఈ సినిమాలు మహేష్ బాబు. 

 


 ఇక రాజకీయాలలో కీలక పదవిలో కొనసాగుతున్న  విలన్ ఇర్ఫాన్ ఖాన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ని కిడ్నాప్ చేసి... ఎవరికీ కనిపించకుండా ఆ అమ్మాయిని ఉంచి... బెదిరించి ప్రజలకు ఎంతో మంచి  చేయిస్తూ ఉంటారు సినిమాలో మహేష్ బాబు. ఇలా ఈ సినిమాలో ఇండైరెక్ట్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడు మహేష్ బాబు. ఇలా ఒక బాధ్యతగల యువకుడిగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఎంతో రిస్క్ చేసిన మహేష్ బాబు యూత్ అందరికీ ఒక గొప్ప మెసేజ్ ఇచ్చారు అని చెప్పాలి. ఇక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: