కెమెరా స్టార్ట్.. యాక్షన్.. ఇదిపుడు వినిపించడా అంటే అవును అనే సమాధానం వస్తోంది. టాలీవుడ్ తో పాటు అన్ని వుడ్ లు కూడా ఇపుడు షూటింగులు అంటే భయంతో వణుకుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా  షూటింగులకు ఒక దండం అంటున్నారు. సినిమా షూటింగులు అంటే వందల మందితో వ్యవహారం.  బయట కరోనా గట్టిగా ఉంది. అక్కడ ఏ చిన్న తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించాల్సిఉంటుంది. అందువల్ల ఎందుకు తొందర అనుకుంటున్నాదిట నటలోకం.

IHG

టాలీవుడ్ విషయానికి వస్తే సీనియర్ హీరోలు ఎవరూ షూటింగ్ అనడంలేదు. మెగాస్టార్ ఆచార్య షూటింగ్ ఇపుడు ఆగింది. అదెటూ ఓన్ ప్రొడక్షన్. అన్నీ కుదిరాకా, అంతా అనుకూలంగా ఉంటే ఆచార్య మొదలవుతుందని అంటున్నారు. మరో వైపు ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ మూవీ కూడా తొందరేమీలేదన్న‌ట్లుగా ఉంటోంది. బాలయ్య ఈ మధ్య ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. షూటింగు అంటే చాలా రిస్క్ అని. పైగా ఎవరినీ కంట్రోల్ చేయలేమని అన్నారు.

IHG

వెంకటేష్ సినిమా ఒకటి సురేష్ బ్యానర్ మీదనే షూటింగుల ఉంది. దాని పేరు నారప్ప. ఈ సినిమాను ఇపుడు ఆపేశారు. ఇప్పట్లో షూటింగులకు వెళ్లవద్దు అని వెంకటేష్ అనుకుంటున్నారుట. నాగార్జున సైతం చేతిలో  సినిమాలు ఉన్నా తాపీగా చేద్దామన్న ధోరణిలో ఉన్నారు. సెట్స్ మీద ఆయన మూవీస్ కూడా లేవు. మరో వైపు మహేష్ బాబు డిసెంబర్లోనే సర్కార్ వారి పాట అంటున్నారు. ఇక రాం చరణ్, జూనియర్ ఎన్టీయార్ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్.ఆర్.ఆర్ కూడా అలాగే ఉంది. అల్లు అర్జున పుష్పకి హైదరాబాద్ లో సెట్స్ వేస్తున్నారు కానీ ఇపుడు అక్కడ  పీక్స్ లో కరోనా వైరస్ ఉంది కాబట్టి కొన్ని నెలలు ఆగడమే బెటర్ అనుకుంటున్నారు.

IHG

పవన్ కళ్యాణ్ సైతం వకీల్ సాబ్ లాస్ట్ షెడ్యూల్ లో ఉన్నారు. ముందు ఆ సినిమా అవాలని, అపుడే మిగిలిన ప్రాజెక్టులు అంటున్నారట. అది కూడా కరోనా తగ్గాకే స్టార్ట్ చేయాలనుకుంటున్నారుట. ఇపుడు కరోనా వ్యాక్సిన్ విషయంలో కొంత పురోగతి కనిపిస్తోంది కాబట్టి అది వచ్చాకే యాక్షన్ కి రెడీ కావాలని హీరోలు అనుకుంటున్నారుట. మొత్తం మీద చూసుకుంటే టాలీవుడ్ కి కరోనా బ్రేకులేసిందని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: