తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇలా వచ్చిన కొన్ని సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేసి.... అందరిని ఆలోచింప చేస్తే కొన్ని సినిమాలు మాత్రం తెరమీద కనిపించకుండానే పోతాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ... ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ ఒక్క సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పటికి తగ్గలేదు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు  కేరాఫ్ అడ్రస్ ఆ  సినిమా... రాజకీయ నాయకుల అందరిలో కాస్త భయం పుట్టించిన సినిమా అది. ఇంతకీ ఆ సినిమా ఏది అనుకుంటున్నారా.. విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు సినిమా. 

 


 సెన్సేషనల్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి పాత్రకు ప్రాణం పోసే విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ సినిమా అసలు సిసలైన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇప్పటికికూడా ఈ సినిమాకి క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. ఒక భారతీయుడు లంచగొండితనాన్ని ఎలా నిర్మించాలి అనే విషయాన్ని భారతీయుడు సినిమా లో స్పష్టంగా చూపించారు. 

 


 ఒక వృద్ధుడి గెటప్ లో నటించిన కమలహాసన్ పాత్రకు ప్రాణం పోశారు అనే చెప్పాలి. అయితే కమల్ హాసన్ తన నటనతో ఆకట్టుకోవడమే కాదు.. ప్రతి భారతీయుడు లంచగొండితనాన్ని నిర్మూలించడానికి కదం తొక్కాలి అనే ఒక మెసేజ్ ని కూడా ఇచ్చారు. అంతే కాదు లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు కమలహాసన్ రాజకీయ నాయకులందరికీ చంపుతూ ఉండటం.. అధికారులందరినీ చంపుతూ ఉండడం.. ఇలా ఈ సినిమా స్టోరీ ఎంతోమంది రాజకీయ నాయకుల్లో కూడా భయం పుట్టింది అని చెప్పాలి. ఈ సినిమా వచ్చిన కొన్నాళ్ళ వరకు రాజకీయ నాయకులు లంచం తీసుకోవాలంటే భయపడిపోయారు. నిజంగా ఇలాంటి భారతీయుడు అనేవాడు ఒకడు ఉన్నాడేమో అనెంతలా ప్రభావితం చేసింది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: