2017 ఆగస్టు 11వ తేదీన విడుదలైన నేనే రాజు నేనే మంత్రి సినిమా లో రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ కేథరీన్ త్రెసా ప్రధాన పాత్రలో చాలా చక్కగా నటించారు. డైరెక్టర్ తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమా కి కథ, స్క్రీన్ ప్లే అందించడంతోపాటు తానే దర్శకత్వం కూడా వహించాడు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. సినిమా కథ గురించి తెలుసుకుంటే... జోగేంద్ర(రానా దగ్గుబాటి) అనే వ్యక్తి ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అతడికి తన భార్య రాధ(కాజల్ అగర్వాల్) అంటే అత్యంత ఇష్టం. పెళ్లయిన మూడేళ్ల తర్వాత రాధ తొలిసారిగా గర్భం ధరిస్తుంది. ఐతే ఒకరోజు ఆ ఊరి సర్పంచ్(ప్రదీప్ రావత్) భార్య రాధను గట్టిగా నెట్టడంతో ఆమె కడుపు పోతుంది. 


ఈ విషయం తెలుసుకున్న జోగేంద్రకు కోపం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ సమయంలోనే సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంటాడు. తదనంతరం అతడు రాజకీయ రంగంలో ఎన్నో ఎత్తులు పైఎత్తులు వేస్తూ ఎమ్మెల్యే, మంత్రి పదవులను అధిరోహిస్తాడు. ముఖ్యమంత్రి కూడా అవ్వాలనే కోరికతో తాను ఎన్నో అక్రమాలకు కూడా పాల్పడుతుంటాడు. ఈ క్రమంలోనే జోగేంద్ర భార్య రాధ చనిపోతుంది. అప్పుడే తాను అధికార దాహంతో తన భార్యను పట్టించుకోలేదని తెలుసుకుని పశ్చాత్తాప పడతాడు. ఆ తర్వాత ప్రజలకు మంచి చేయాలని భావంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే జోగేంద్ర జీవితం ఎలా కొనసాగిందో దర్శకుడు తేజ అందరూ నమ్మేట్టుగా చాలా ప్రాక్టికల్ గా చూపించాడు. 


తేజ ఈ చిత్రంలో జోగేంద్ర పాత్రను చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఎన్నో చెడ్డ లక్షణాల తో జిత్తులమారి, మోసపూరితమైన ఎత్తులు పైఎత్తులు వేసే జోగేంద్ర క్యారెక్టర్ లో రానా జీవించేసాడని చెప్పుకోవచ్చు. అధికార దాహం కోసం విపరీత ప్రవర్తన తో అందర్నీ భయపెట్టే జోగేంద్ర పాత్ర ప్రేక్షకులను థ్రిల్ చేయడంతో పాటు ఎంటర్టైన్ చేసింది. కాజల్ అగర్వాల్ రాధా పాత్రలో చాలా అందంగా కనిపించింది. సినిమా కథ మొత్తం దాదాపు ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తన పాత్రకి పూర్తి స్థాయిలో కాజల్ అగర్వాల్ న్యాయం చేసి అందరిని బాగా ఎంటర్టైన్ చేసింది. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన జోగేంద్ర జోగేంద్ర సాంగ్, సుఖీభవ సుమంగళి పాట కూడా సూపర్ హిట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ చిత్రంలో జోగేంద్ర వేసే రాజకీయ ఎత్తులు పైఎత్తులు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తేజ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: