తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో  పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు వస్తూనే ఉంటాయి అనే విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు జూనియర్ హీరోలు కూడా ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమాల్లో నటించి ఎన్నో మంచి విజయాలను కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి అని చెప్పాలి, ఇలా వచ్చిన ఓ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది . అదే కెమెరామెన్ గంగతో రాంబాబు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా... తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది  అనే చెప్పాలి. 

 

 ఈ సినిమా ఎన్నో వివాదాలను  రగిల్చింది. అప్పుడే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో తెలంగాణ తల్లి అనే ఒక నినాదం తెర మీదికి వచ్చి సంచలనం గా మారిపోయింది. అదే సమయంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాలో తెలుగుతల్లి అనే పదాన్ని వాడుతూ కొన్ని సన్నివేశాలు ఉంటాయి. తెలుగు తల్లి ఎక్కడుందో చూపించు అంటూ పవన్ కళ్యాణ్ కొన్ని డైలాగులు చెబుతూ ఉంటారు. అయితే ఈ సన్నివేశాలు  ఎన్నో వివాదాలకు కారణం అయ్యాయి అని చెప్పాలి. అప్పుడే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో తెలంగాణ తల్లి ని  కించపరిచే విధంగా కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఎంతోమందిని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నిరసనలు  కూడా చేపట్టారు. 

 


 వెంటనే తెలంగాణ తల్లిని కించపరిచే విధంగా సన్నివేశాలు సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతే కాదు తెలంగాణ లో ఎంతోమంది ఈ సినిమా కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే తెలంగాణ తల్లి ని ఉద్దేశించి ఈ సన్నివేశాలను చిత్రీకరించ లేదు అని చిత్రబృందం క్లారిటీ ఇచ్చినప్పటికీ... తెలంగాణ ప్రజలు మాత్రం శాంతించలేదు అని చెప్పాలి. ఇలా  పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వివాదాలకు కారణమైంది. పెద్ద సంచలనమే సృష్టించింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కాస్త పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు దూరంగానే ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: