తమిళ సినిమాల్లో తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకున్న హీరో విశాల్. తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవడంతో ఆయన సినిమాలకు ఇక్కడ కూడా ఆదరణ దక్కుతోంది. విశాల్ నటించిన సినిమాలకు మినిమం గ్యారంటీ ఉంటుందని పేరు. ప్రస్తుతం విశాల్ కొత్త సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ‘చక్ర’ అనే సినిమాలో నటించాడు విశాల్. ఈ సినిమాకు సంబంధించి గతంలోనే ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ వీడియో కూడా రిలీజ్ చేశారు.

IHG

 

నిముషం నిడివి ఉన్న వీడియో సినిమా థీమ్ గురించి క్లూ ఇచ్చారు మేకర్స్. సినిమా అంతా సైబర్ నేరాలపై తెరకెక్కినట్టు తెలుస్తోంది. గతంలో విశాల్ ఇదే తరహాలో ‘అభిమన్యుడు’ సినిమా చేశాడు. ఆ సినిమా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగులో మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు చక్ర కూడా ఇదే తరహాలో ఉండబోతోందని సమాచారం. ఈ సినిమాలో విశాల్ మిలటరీ ఆఫీసర్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. తమిళ్ లో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అదే పాయింట్ గా ఈ సినిమా కూడా తెరకెక్కిందని కోలీవుడ్ సమాచారం. సినిమాలో రెజీనా, శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్లుగా నటించారని తెలుస్తోంది.

IHG

 

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు ఎమ్మెస్ ఆనందన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రసన్న, సుహాసిని ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. పరిస్థితులు అనుకూలిస్తే ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: