నెపోటిజం... బాలీవుడ్ ని షేక్ హేస్తున్న పదం  ఇది. ఈ పదం  వింటే చాలు బాలీవుడ్ షేక్ అవుతుంది. ఈ పదం  పేరు వింటే చాలు ఇప్పుడు అక్కడ ప్రముఖులు కూడా భయపడుతున్నారు. సుశాంత్ సింగ్ మరణం దెబ్బకు బాలీవుడ్ ఈ పదం  వింటే చాలు కంగారు పడిపోతుంది. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అదే అని అంటున్నారు. అగ్ర హీరోల కారణంగా ప్రముఖుల కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు అంటున్నారు అక్కడి జనాలు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు అతను ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని చాలా మంది అంటున్నారు. 

 

తాజాగా దీనిపై రేణు దేశాయ్ స్పందించారు. సుశాంత్ ఆత్మహత్యపై ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు సుశాంత్ సున్నితం అనుకుంటా అంటూ ఆమె కామెంట్స్ చేసారు. సుశాంత్ చాలా సెన్సిటివ్ అనుకుంటానని ఆమె వ్యాఖ్యానించారు. టాలెంట్ ఉంది కాబ‌ట్టి తను సినిమా రంగంలో సక్సెస్ అయ్యాడని చెప్పారు. స్టార్ అయ్యాడని... త‌నని తాను జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలని ఆమె పేర్కొన్నారు. సుశాంత్ ఎమోషన్స్‌ను త‌ను బ్యాలెన్స్ చేసుకోలేక‌పోయాడనుకుంటున్నానని అన్నారు ఆమె. 

 

అందువ‌ల్లే త‌ను డిప్రెస్ అయ్యాడని చెప్పారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండో, టాలెంట్‌లో న‌మ్ముకుని సినీ రంగంలోకి రావ‌డం కాదన్నారు. మ‌నోధైర్యం కూడా ఉండాలని అన్నారు. మ‌న‌ల్ని మ‌నం ఇక్క‌డ ప్రూవ్ చేసుకోవాలంటే చాలా మాన‌సిక ధైర్యం అవ‌స‌రమని ఆమె ఈ సందర్భంగా అపెర్కొన్నారు. ఇక సుశాంత్ మరణం కి అదే కారణం అని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా వ్యాఖ్యలు చేసారు. దీనిపై ఇప్పుడు అక్కడ తీవ్ర దుమారం రేగుతుంది. సోషల్ మీడియాలో ప్రముఖులను ట్రోల్ చేయడానికి కూడా  ఇదే కారణమని అంటున్నారు బాలీవుడ్ జనాలు. కాగా ఇటీవల సుశాంత్ ముంబై లోని తన నివాసం లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: