టాలీవుడ్ డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ తన కెరీర్లో ఎన్నో మాసివ్ సబ్జెక్ట్స్ చేశాడు. కానీ.. ఎన్ని చేసినా పూరి మనసులో ఉన్న కథ మాత్రం ‘జనగణమన’. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా ఎన్నో ఏళ్ల నుంచీ ఆయన డ్రీమ్ లోనే ఉండిపోయింది. ఇప్పుడీ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఈ సబ్జెక్ట్ పై పూరినే ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ‘జనగణమన నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఆ సినిమాను అతి త్వరలోనే తెరకెక్కిస్తాను’ అంటూ తన పూరి కనెక్ట్స్ నుంచి ట్వీట్ చేశారు. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా తెరకెక్కబోతోందని క్లారిటీ వచ్చేసింది.

IHG

 

అయితే.. ఇందులో హీరోగా ఎవరు నటిస్తారు అనే విషయంపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. ఇండస్ట్రీలో రౌండ్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాను బాలకృష్ణతో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ తో చేస్తున్న సినిమా తర్వాత ‘జనగణమన’నే తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. బాలయ్యతో పూరి త్వరలో సినిమా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పూరి ‘జనగణమన’ కోసం బాలయ్యను ఫిక్స్ చేసుకున్నాడని అంటున్నారు. వీరి కాంబోలో వచ్చే సినిమా ఇదేనని తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతున్నాయి.

IHG

 

ఈ కథను పూరి దాదాపు ఏడేళ్ల క్రితమే రెడీ చేసుకున్నాడు. ఈ సినిమాను మహేశ్ తో తెరకెక్కిస్తానని కొన్నేళ్ల క్రితమే చెప్పుకొచ్చారు పూరి. కానీ.. వీరిద్దరి మధ్య ఏర్పడ్డ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా వర్కౌట్ కాలేదు. పూరి మంచి కథతో వస్తే సినిమా చేస్తా అని మహేశ్ ఇటివల చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పట్లో ఈ కాంబో తెరకెక్కే అవకాశాలు కనపడటం లేదు. దీంతో.. ఈ సినిమా బాలయ్యతోనే అనే వార్తలు రౌండ్ అవుతున్నాయి. దీనిపై పూరినే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: