ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయాల‌ను.. క‌ళ్ల‌కు కంటి చూపించేలా ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. రాజకీయ ముసుగులో జ‌రిగే అక్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలిసేలా చేశాయి. అయితే ఇలా పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన సినిమాల్లో `ఓట‌ర్` సినిమా కూడా ఒక‌టి. హీరో మంచు విష్ణు, సురభి జంటగా వ‌చ్చిన సినిమా ఇది. ఈ చిత్రాన్ని జి కార్తీక్ రెడ్డి దర్శకతంలో తెరకెక్కింది. ఆచారి అమెరికా యాత్ర సినిమా త‌ర్వాత కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్న ఈయ‌న‌.. `ఓట‌ర్` సినిమాతో అదిరిపోయే రాజ‌కీయం చేశాడు.  

 

భారత రాజ్యాగంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యత ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఒక ఓటర్ వేసే ఓటు వల్ల రాజకీయ నాయకులూ మాత్రమే కాదు.. మొత్తం రాజకీయ వ్యవస్థే మారుతుంది. అయితే ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల తరవాత వాళ్లను పట్టించుకోని రాజకీయ నాయకుల పనిపట్టే ఓటర్‌గా ఈ సినిమాలో మంచు విష్ణు కనిపిస్తాడు. ప్రజలను మోసం చేసిన రాజకీయ నాయకులను తన తెలివితేటలతో హీరో ఎలాంటి గుణపాఠం నేర్పాడో చూపించాడు.

 

ఈ క్ర‌మంలోనే సినిమాలోని రాజ‌కీయ నాయ‌కుల‌కు ఒక ఓట‌ర్‌గా విష్ణు చుక్క‌లు చూపించాడు. అలాగే ఈ సినిమాకు సెకండాఫ్‌నే ప్రాణంగా నిలుస్తుంది. ప్రజాసేవ చేయని ఎమ్మెల్యే, ఎంపీలను వెనుకకు రప్పించే అంశాన్ని ఎత్తుకోవడం సినిమాకు ప్ర‌ధాన‌ ఆకర్షణగా మారుతుంది. సోషల్ మీడియాను ఆధారంగా చేసుకొని ప్రజలను చైతన్య పరిచే అంశం అద్భుతంగా ఉంటుంది. 

 

అలాగే కామన్ మ్యాన్, ఓటర్ మూడో కన్ను తెరిస్తే ఏమౌతుందో అనే అంశం సినిమాకు హైలెట్. రీకాల్ అంశాన్ని దర్శకుడు సూటిగా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఓటర్ చిత్రం రిలీజ్‌కు ముందు పలు వివాదాల కారణంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ చిత్రాన్ని ప్రశాంత్ గౌడ్ సార్ధక్ బ్యానర్‌పై జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది.

 

 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: