తన చిట్టి నడుముతో కుర్ర కారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన గోవా బ్యూటీ ఇలియానా తన అంద చందంతో అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. దేవదాస్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైన ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ సరసన పోకిరి సినిమాలో నటించి మెప్పించింది. ఆ సినిమాతో ఇలియానాకు స్టార్ క్రేజ్ వచ్చింది. ఇక అప్పటినుండి వరుస స్టార్ ఛాన్సులతో అమ్మడు దుమ్ముదులిపేసింది.

 

ఇక్కడ కెరియర్ పీక్స్ లో ఉన్న టైం లోనే బాలీవుడ్ నుండి ఆఫర్ రాగానే అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లిన అమ్మడు అక్కడ సినిమాలైతే చేసింది కాని అందుకు తగినట్టుగా క్రేజ్ తెచ్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది. ఇక్కడ స్టార్ ఛాన్సులు వస్తున్నా సరే అక్కడ సినిమాలు చేస్తూ కొద్దిగా ఫోజు కొట్టిన ఇల్లి బేబ్ అక్కడ తన రేంజ్ ఎంతో తెలుసుకున్నాక మళ్లీ సౌత్ బాట పట్టింది. తెలుగు, తమిళ భాషల్లో ఇలియానా స్టార్ డం తెచ్చుకుంది. కాని ఇక్కడ ఛాన్సులు వదిలి వెళ్లినందుకు అమ్మడికి మళ్లీ ఇక్కడ అవకాశాలు రాలేదు.

 

కొన్నాళ్లు రష్యన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో డేటింగ్ తో కాలం వెళ్లదీసిన ఇలియానా ఇప్పుడు మళ్లీ సినిమాల మీద ఫోకస్ పెట్టాలని చూస్తుంది. రెండేళ్ల క్రితం మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ సినిమాలో కొద్దిగా బొద్దుగా కనిపించేసరికి అందరు షాక్ అయ్యారు. త్వరలో అమ్మడు నాగార్జున సరసన నటిస్తుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే నితిన్ హీరోగా బాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ అందాదున్ తెలుగు వర్షన్ లో నెగటివ్ రోల్ కోసం ఇలియానాని అడిగారట. కాని తాను చేస్తే హీరోయిన్ గానే చేస్తా కాని నెగటివ్ రోల్ చేయనని చెప్పిందట. మరి అసలే ఆఫర్లు లేవంటున్న ఇలియానాకు ఈ సోకులెందుకని అంటున్నారు నెటిజెన్లు. ఏదైనా అమ్మడు మాత్రం మళ్లీ ఛాన్స్ అంటూ వస్తే దుమ్ముదులిపేసేందుకు సిద్ధం అని అంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: