టాలీవుడ్ లో నిత్యా మీనన్ సినిమాలు అనగానే కథ మీద జనాలకు ఒక ఆసక్తి అనేది ఉంటుంది. సినిమా ఎప్పుడు వస్తుంది ఏ విధంగా ఉంటుంది అంటూ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమాలో ఉండే కోణం మీద కూడా జనాలకు ఒక ఆసక్తి ఉంటుంది. ఆమె మాత్రం ఇప్పుడు చాలా వరకు మన తెలుగు లో సినిమాలు చేయడం లేదు. అవకాశం ఉంటే మాత్రమే ఆమె సినిమాలు చేస్తున్నారు. ఇక ఆమె మాత్రం ఎవరిని తనకు అవకాశం కావాలి అని అడిగి  సినిమా చేసే పరిస్థితి దాదాపుగా లేదు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో  ఒక వార్త  హాట్ టాపిక్ గా మారింది. అవకాశాలు లేవు కాబట్టి తాను కూడా అవకాశాల కోసం ఎదురు చూడటం లేదు కాబట్టి ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉండి వివాహం చేసుకోవాలి అనే ఆలోచన లో ఉంది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదే విషయాన్ని ఆమె ఇంట్లో కూడా చెప్పింది  అని వాళ్ళు కూడా ఇప్పుడు అదే విధంగా సంబంధాలు చూసే పని లో పడ్డారు అని తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే హీరోయిన్ లకు కాస్త గడ్డు కాలమే అని చెప్పాలి. 

 

అందుకే ఇప్పుడు జాగ్రత్తగా ఆమె సినిమాల మీద దృష్టి పెడుతూనే ముందు లైఫ్ లో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడం మంచిది అనే ఆలోచనలో ఉంది అనే టాక్ వినపడుతుంది. చూడాలి మరి ఎం జరుగుతుంది అనేది. అగ్ర హీరోల సినిమాల్లో మాత్రం ఆమెకు మంచి ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే.  ఇక ఇప్పుడు ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: