తమ కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీస్ కొన్ని ఉండాలని ఏ హీరో అయినా కోరుకుంటాడు. అటువంటి సినిమాలు హిట్, ఫ్లాప్ కు అతీతంగా వారి కెరీర్లో ఉండిపోతాయి. మాస్ మహారాజ్ రవితేజ కెరీర్లో ఎన్నో హిట్స్ ఉన్నా.. వాటిలో ప్రముఖంగా చెప్పుకునే సినిమా ‘విక్రమార్కుడు’. ఈ సినిమా విజయానికి కథలో దమ్ము కారణమా.. రవితేజ పెర్ఫార్మెన్స్ కారణమా.. అంటే చెప్పడం కష్టం. రవితేజ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ గా, ల్యాండ్ మార్క్ లా నిలిచిపోయిన ఈ సినిమా విడుదలై నేటితో 14ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

ఏస్ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2006 జూన్23న విడుదలైంది. దొంగగా, పోలీస్ ఆఫీసర్ గా రవితేజ రెండు పాత్రల్లో తన స్థాయి మార్క్ చూపించాడు. దొంగగా అత్తిలి సత్తిబాబు పాత్రలో రవితేజ చేసిన కామెడీ, మాస్ టైమింగ్ ధియేటర్లో నవ్వులు పూయించాయి. ముఖ్యంగా విక్రమ్ రాధోడ్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ నటన సినిమాకు హైలైట్. తమిళ్ రీమేక్ షూటింగ్ జరిగినన్నాళ్లూ తన ఫోన్ డిస్ ప్లేలో రవితేజ్ పోలీస్ ఆఫీసర్ ఫొటో పెట్టుకున్నాడట కార్తీ.. ఇన్ స్పిరేషన్ కోసం. రవితేజ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అటువంటిది.

IHG

 

బీహార్ నేపథ్యం, దొంగ, పోలీస్ నేపథ్యం.. ఇలా ఈ కథలో మూడు షేడ్స్ తో కథ రాసిన విజయేంద్రప్రసాద్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. రత్నం డైలాగులు ధియేటర్లో పేలిపోయాయి. రాజమౌళి మాయాజాలంతో సినిమాను ఓ లెవల్ కు తీసుకెళ్లాడు. కీరవాణి సంగీతం సినిమాకు ప్లస్. పాటలన్నీ సూపర్ హిట్టే. అనుష్క హీరోయిన్ గా నటించింది. ఆరు భాషల్లో రీమేక్ అయిన ఈ సినిమా అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయికి వెళ్లిందని చెప్పాలి. శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మించారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: