చిన్న హీరోల సినిమాలు అయినా పెద్ద హీరోల సినిమాలు అయినా సరే ఇప్పుడు విడుదల కావడం అనేది చాలా కష్టం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అగ్ర హీరోల సినిమాలను విడుదల చేయడం అనేది ఇప్పుడు దాదాపుగా కష్టమే. ఇక ఈ నేపధ్యంలోనే సీనియర్ హీరోలు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తుంది. సీనియర్ హీరోలు కొందరు ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... సినిమాల విడుదల విషయంలో ఎలాగూ అవకాశం లేదు కాబట్టి... 

 

భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ కూడా వచ్చే ఏడాది కూడా విడుదల చేయవద్దు అని కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే విడుదల చెయ్యాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది ఇప్పుడు టాలీవుడ్ లో. సినిమాలను విడుదల చేసినా సరే నష్టపోవడమే గాని లాభం ఉండదు అని భావిస్తున్నారట టాలీవుడ్ జనాలు. అందుకే ఇప్పుడు సినిమాల విడుదలను వాయిదా వేసుకోవడం కంటే భారీ ప్రాజెక్ట్ సినిమాలను  వాయిదా వేయడమే మంచిది అని లేట్ గా షూట్ చేయడం మంచిది అనే ఆలోచనలో ఉన్నారట. 

 

ఇక ఇప్పుడు సినిమాలను విడుదల చేసినా సరే జనాలు కూడా చూసే అవకాశాలు దాదాపుగా లేవు అనే చెప్పాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట. అంటే ఆర్ఆర్ఆర్ సినిమా గాని ఆచార్య సినిమా గాని మహేష్ సర్కారు వారి పాట సినిమా గాని ఈ ఏడాది వచ్చే అవకాశం లేదని అర్ధమవుతుంది అంటూ టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. చూడాలి ఎంత వరకు హీరోలు సినిమాలను విడుదల చేస్తారు అనేది. ఇప్పుడు కరోనాలో షూటింగ్ కి కూడా వెళ్ళడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: