తెలుగు ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’ మూవీస్ ఏ రేంజ్ లో అదరగొట్టాయో తెలిసిందే.  అప్పట్లో నందమూరి ఫ్యాన్స్ పండగచేసుకున్నారు.  ఫ్యాక్షన్ తరహా చిత్రాలకు పెట్టింది పేరు బాలయ్య.. ఇక ఆయన నటించే చిత్రాలకు కూడా టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉండేలా చూస్తుంరు.  తాజాగా బోయపాలి -బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది.  ఇటీవల దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి.. ఇటీవల మళ్లీ షూటింగ్స్ కి పరమిషన్ వచ్చింది.  అయితే బాలయ్య టైటిల్ ను బట్టే ఆ చిత్రం ఎలా ఉంటుందన్న అంచనాకు అభిమానులు వచ్చేస్తారు.

IHG

దీనిని దృష్టిలో పెట్టుకునే బోయపాటి తన చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేస్తుంటాడు. గతంలో బాలకృష్ణతో 'సింహా', 'లెజండ్' వంటి పవర్ ఫుల్ టైటిల్స్ తో హిట్ చిత్రాలను రూపొందించిన బోయపాటి ఇప్పుడు ఆయనతో మూడో చిత్రాన్ని చేస్తున్నారు.  ఇటీవల నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు.. ఇక టీజర్ లో బాలయ్య డైలాల్స్ కి ఫ్యాన్స్ పూనకం వచ్చిన వాళ్లలా ఊగిపోయారు.  మరి ఈ చిన్న టీజర్ ఈ రేంజ్ లో ఉంటే.. ఇక చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో అని నందమూరి ఫ్యాన్స్ తెగ ఆనంద పడిపోతున్నారు. 

 

ఇక ఈ చిత్రానికి ఎంతో ఆలోచించిన మీదట 'మోనార్క్' అనే టైటిల్ని ఫైనల్ చేసినట్టు తాజా సమాచారం. కథకు ఈ టైటిల్ బాగా సరిపోతుందని అందరూ సంతృప్తి చెందిన మీదట దీనిని ఫైనల్ చేశారని తెలుస్తోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి తమన్ సంగీతం ఓ హైలైట్ అవుతుందనే చెప్పచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: