బుల్లితెర మీద సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్.. లాక్ డౌన్ వల్ల ఆ షో కూడా షూటింగ్ చేయడం కుదరలేదు. అయితే ఈమధ్యనే మళ్లీ షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. స్మాల్ స్క్రీన్ సీరియల్స్ తో పాటుగా రియాలిటీ షోస్ కూడా స్టార్ట్ అవడం జరిగింది. వాటితో పాటుగా జబర్దస్త్ కూడా షూటింగ్ చేశారు. ఈ గురువారం ఈటివిలో జబర్దస్త్ కొత్త ఎపిసోడ్ సందడి చేయనుంది. ఇక్కడ విశేషం ఏంటంటే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండు కలిపి ఒక షోగా ముందు మొదలు పెడుతున్నారట. ఎక్స్ ట్రా జబర్దస్త్ ఉంటుందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఇదిలాఉంటే తన సంచి నిండా పంచులతో వచ్చి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది ఎప్పటిలానే తన పంచులతో అదరగొట్టాడు.

 

జస్ట్ రెండు నిమిషాల ప్రోమోలోనే ఆది తన స్టామినా చూపించాడు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మొదటి స్కిట్టు కదా అనే ఆలోచన ఏమి లేకుండా బాలకృష్ణ మీద పంచు వేశాడు ఆది. ఈమధ్య రిలీజైన బిబి3 ఫస్ట్ లుక్ టీజర్ లో బాలకృష్ణ డైలాగ్ ను మార్చి చెప్పాడు ఆది. స్వతహాగా పవర్ స్టార్ ఫ్యాన్ అయిన హైపర్ ఆది జనసేన తరపున ప్రచారంలో కూడా పాల్గొన్నాడు. మెగా అభిమానాన్ని తన స్కిట్టులో చూపించే ఆది అప్పుడప్పుడు బాలయ్య టార్గెట్ తో స్కిట్స్ చేస్తాడు. అందులో భాగంగానే లేటెస్ట్ ఎపిసోడ్ లో బిబి3 డైలాగ్ మీద సెటైర్ వేశాడు ఆది. 

 

కచ్చితంగా ఆది అది కావాలనే చేసినట్టు తెలుస్తుంది. ఇంతకుముందు కూడా బాలకృష్ణ డైలాగ్స్ మీద హైపర్ ఆది పంచులు వేయడం చూశాం. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినా బాలకృష్ణ కొత్త డైలాగ్ ను కూడా ప్రోమోలోనే వదల్లేదు ఆది. మొత్తానికి మూడు నెలలు గ్యాప్ వచ్చినా ఆది మారలా.. స్కిట్టు మారలా.. బాలయ్యపై పంచు కూడా మారలా.. సో ఆడియెన్స్ కు మళ్లీ ఫుల్ ఫన్ జెనరేట్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈసారి కొత్తగా తాగుబోతు రమేష్ కూడా ఒక టీం లీడర్ గా కనిపిస్తున్నాడు. అంటే ఉన్నవాళ్లని కొందరిని తీసేసి కొత్త టీం ఏర్పాటుచేసినట్టు తెలుస్తుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: