ఇప్పుడు తెలుగు లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు జనాలకు ఒక రేంజ్ లో పండగ మాదిరి వాతావరణం ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఆయన సినిమా కోసం ఎదురు చూస్తూ దాని గురించి ఏ వార్త వచ్చినా సరే చదువుతూ ఇక సోషల్ మీడియాలో సినిమా కథ అల ఉంటుంది ఇలా ఉంటుంది అంటూ ఏదోక కథనం రాస్తూ ఆయన ఫాన్స్ నుంచి సినీ పరిశీలకులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఇప్పుడు చాలానే జాగ్రత్త పడుతున్నారు. 

 

ఆయన ఒక సినిమాను విడుదల చెయ్యాలి అంటే అది కచ్చితంగా  అన్నీ పూర్తి అయిన తర్వాత మాత్రమే విడుదల చేస్తున్నారు గాని ఏ మాత్రం తొందరపడటం లేదు. గతంలో పవన్ సినిమాలో కొన్ని సీన్ లు సరిగా లేకపోయినా సరే రీ షూట్ అడిగే వారు కాదట. కాని ఇప్పుడు ఆయన సినిమాలో ఒక్క సీన్ సరిగా లేకపోయినా సరే రీ షూట్ కావాలి అని అడుగడమే కాదు దానిని చేసే వరకు కూడా ఆయన వదలడం లేదు అని టాక్. వకీల్ సాబ్ సినిమాలో దాదాపు 20 సార్లు కొన్ని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసారు అని టాక్. 

 

దానికి కారణం ఏంటీ అనేది ఎవరికి తెలియదు గాని పవన్ గతంలో మాదిరి గా ఇప్పుడు లేరు అని అంటున్నారు. ఆయన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతాయి అనే పేరు నుంచి బయటకు రావాలి అనే ఆయన ఈ విధంగా దర్శక నిర్మాతలను రీషూట్ అడుగుతున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. కాగా పవన్ వకీల్ సాబ్ తర్వాత... క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: