టాలీవుడ్ లో రాశీ ఖన్నా కు చాలా తక్కువ కాలంలోనే మంచి పేరు వచ్చింది. అగ్ర హీరోలతో ఎక్కువగా సినిమాలు చేసినా లేకపోయినా సరే ఆమెకు మాత్రం మంచి పేరు అయితే వచ్చింది అని చెప్పాలి. ఇప్పుడు ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉంది. దానికి కారణం వరుసగా విజయాలు రాకపోవడమే అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమెకు మంచి ఆఫర్లు వచ్చినా సరే ఆమె మాత్రం వాటిని ఎక్కువగా కాపాడుకోలేదు అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే ఆమె నిలబెట్టుకోవడం లో ఘోరంగా ఫెయిల్ అయింది అనే చెప్పాలి. 

 

చిన్న చిన్న హీరోలు అందరూ కూడా ఆమెను హీరోయిన్ గా అడుగుతున్నా సరే ఆమె మాత్రం సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీనికి కారణం వరుస ఫ్లాప్ లు. ఇక ఇప్పుడు ఆమె విషయంలో మరో కోణం కూడా ఆసక్తికరంగా మారింది. అది ఏంటీ అంటే ఆమె పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళే ఆలోచనలో ఉంది అని తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది. 

 

ఆమె పెళ్లి చేసుకునే విషయం ఇప్పుడు ఫ్యామిలీ కి కూడా చెప్పింది అని వాళ్ళు కూడా అందుకు ఓకే చెప్పారు అని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాలి. ఇప్పుడు ఆమె ఒక సినిమాలో మాత్రమే నటిస్తుంది. వచ్చే ఏడాది ఆమె చేతిలో సినిమాలు ఏమీ లేవు. ఆమెనే సినిమా ఆఫర్లను వద్దు అని భావిస్తుంది అని అందుకే సినిమాలకు దూరంగా ఉంది అని అంటున్నారు. ఇక ఈ విషయం తెలిసిన దర్శక నిర్మాతలు కూడా ఆమెను అడగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: