టాలీవుడ్ లో మరే హీరోకి లేనట్టుగా అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరో అన్న ఒక డిఫ్రెంట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్..వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఫ్లాపయినప్పటికి ఈ యంగ్ హీరో క్రేజ్ మాత్రం అసలు తగ్గనేలేదు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే కొంత టాకీ పార్ట్ కంప్లీట్ చేసిన పూరి లాక్ డౌన్ తో అన్ని సినిమాలతో తన సినిమాని నిలిపివేశాడు. 

 

పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ అన్న బ్యానర్స్ లో పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తుండగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ కి జంటగా అనన్య పాండే నటిస్తుంది. ఇక ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

 

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో కొరటాల తెరకెక్కిస్తాడని అందుకు తగ్గట్టుగానే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం కొరటాల మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి సినిమా కంప్లీట్ అవగానే ఇటు కొరటాల చిరంజీవి సినిమా ని కంప్లీట్ చేసి విజయ్ కొరటాల కాంబినేషన్ లో సినిమా మొదలవుతుందట.

 

ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక విజయ్ దేవరకొండ నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సక్సస్ లు అందుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేస్తాడట. ప్రస్తుతం శివ నిర్వాణ నాని తో టక్ జగదీష్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. నాని సినిమా కంప్లీట్ అవగానే విజయ్ దేవర కొండ సినిమాకి వస్తాడు. పూర్తి స్థాయిలో స్కిప్ట్ రెడీ చేసి విజయ్ తో ప్రాజెక్ట్ మొదలు పెడతాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తాడని సమాచారం.  ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్స్ తో విజయ్ దేవరకొండ దాదాపు మూడేళ్ళ వరకు లాకయి ఉన్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్స్ లో ఏదైనా డిలే అయితే ఇంద్రగంటి మోహన కృష్ణ ప్రాజెక్ట్ లైన్ లోకి వస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: