బిజీ లైఫ్ లో వినోదం కోసం మనం ఎంచుకున్న మార్గం సినిమా. సినిమాల్లో హీరో వంద మందిని అవలీలగా కొట్టేస్తాడు. ఇది నిజం కాదని తెలిసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈలలు, చప్పట్లతో ధియేటర్లు హోరెత్తిస్తారు. హీరోలు కూడా మనుషులే అనే భావన ఆ రెండున్నర గంటలు ఎవరికీ గుర్తు రాదు. అయితే ఇప్పటినుంచి హీరోలపై అభిప్రాయం మార్చుకోమని చెప్తున్నాడు ప్రముఖ బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరేశ్ రావల్. తెలుగులో బావగారూ బాగున్నారా.. శంకర్ దాదా ఎంబీబీఎస్, క్షణక్షణం, గోవిందా గోవిందా వంటి సినిమాల్లో నటించాడు ఈ వెర్సటైల్ యాక్టర్.

IHG

 

‘ఇక నుంచి సినిమా హీరోలను ఎంటర్ టైనర్స్ గా పిలవండి. సైనికులు, పోలీసులను నిజమైన హీరోలుగా పిలవండి. మన భావి తరాలకు హీరోలంటే ఎవరో అనే నిజమైన అర్ధాన్ని వివరించండి’ అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఆయన అభిప్రాయంలో ఎంతో ఆవేదన కనిపిస్తోందనే చెప్పాలి. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుత కరోనా సమయంలో పోలీసులు ఎంత నిబద్ధతో తమ బాధ్యతలు నిర్వహించారో చూశాం. మరోవైపు మన సైనికులు బోర్డర్ లో అటు పాకిస్థాన్ ముష్కరులతో.. ప్రస్తుతం చైనాతో ఘర్షణల్లో వారు చేస్తున్న వీరోచిత త్యాగాలే ఆయనతో ఈ వ్యాఖ్యలు చేసేలే చేసింది.  

IHG

 

పరేశ్ రావల్ ట్వీట్ కు నెటిజన్ల నుంచి సపోర్ట్ వస్తోంది. మీరు చెప్పింది నిజమే అంటూ రిప్లైలు ఇస్తున్నారు. హీరోయిన్ ప్రణీత సుభాష్ కూడా పరేశ్ రావెల్ పోస్ట్ కు సపోర్ట్ చేస్తూ ‘బాగా చెప్పారు’ అంటూ ట్వీట్ చేసింది. రీసెంట్ గా గాల్వన్ లోయలో సంతోష్ బాబుతో సహా 20మంది జవాన్ల వీరమరణం దేశంలో తీవ్ర సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో పరేశ్ రావెల్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: