టాలీవుడ్ లో పూరి జగన్నాధ్ కి ఒక బ్రాండ్ ఉంది. ఆయన సినిమాలన్ని పక్కా కమర్షియల్ పంథాలో తెరకెక్కి అయితే బ్లాక్ బస్టర్ లేదా భారీ డిజాస్టర్ అవుతుంటాయి. కాని ఆయన కి సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న క్రేజ్ అండ్ మార్కెట్ మిగతా దర్శకులందరి కంటే ఎక్కువే. ఒక దర్శకుడిగా 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ..అంటే అది ఒకే ఒక్క పూరి జగన్నాధ్. నమ్మినవాళ్ళు చావు దెబ్బ కొట్టిన తేరుకొని మళ్ళీ తన స్టామినా ఏంటో చూపించాడు.

 

IHG

పవన్ కళ్యాణ్ బద్రి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోకిరి ఎంతటి సంచనాలు సృష్ఠించిందో తెలుగు ప్రేక్షకులకే కాదు మిగతా భాషల్లో ఉన్న ఫ్యాన్స్ అందరికీ తెలిసిందే. మహేష్ బాబు తో తీసిన పోకిరి 75 సంవత్సరాల రికార్డ్స్ ని తిరగరాసింది. ఇక బిజినెస్ మాన్ అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువమందికి నచ్చింది. ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్ కి అమ్మాయిలే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉండటం విశేషం. ఇక పూరి మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన పోకిరి ..బిజినెస్ మాన్ తర్వాత హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో పూరి జనగణమన స్క్రిప్ట్ రాశాడు.

 

IHG

కాని ఇంతవరకు వర్కౌట్ కాలేదు. అయితే తాజాగా పూరి నా డ్రీం ప్రాజెక్ట్ జనగణమన ని త్వరలో ప్రారంభించబోతున్నానంటూ వెల్లడించాడు పూరి. అంతే ఇక మళ్ళీ ఒక వైపు మహేష్ ఫ్యాన్స్ అది మా సూపర్ స్టార్ కోసమే అంటూ సంబరపడుతున్నారు. అలాగే లాక్ డౌన్ లో పూరి స్క్రిప్ట్ రాసింది బాలయ్య కోసమే అంటూ వార్తలు వస్తున్నాయి. దాదాపు బాలయ్య పూరి కాంబినేషన్ లో సినిమా మాత్రం త్వరలో ఉంటుంది. అది జనగణమన అంటూ మా బాలయ్య కోసమే అంటూ బాలయ్య ఫ్యాన్స్ కూడ మరోవైపు సంబర పడుతున్నారు. 

 

IHG's 'Paisa Vasool' and <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MAHESH' target='_blank' title='mahesh- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>mahesh</a> Babu's 'Spyder' set for a ...

కాని ఇక్కడ పూరి అటు మహేష్ ఇటు బాలయ్య ఫ్యాన్స్ కి షాకిచ్చినట్టు తెలుస్తుంది. పూరి డ్రీం ప్రాజెక్ట్ జనగణమన కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం అంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలో అఫిషియల్ గా న్యూస్ వెల్లడికానుందట. అయితే ప్రస్తుతం ఇది పూరి అండ్ ఛార్మి గోప్యంగా ఉంచారని సమాచారం.

 

IHG

ఇక పూరి కి రజనీకాంత్ తో సినిమా చేయాలన్న కోరిక బలంగా ఉంది. కాని రజనీకాంత్ అన్నాత్తే తర్వాత సినిమాలు మానేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్టు కోలీవుడ్ మీడియా సమాచారం. మరి పూరి ఒప్పిస్తే రజనీకాంత్ ఒక మాస్ హిట్ కోసం ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక పూరి రజనీకాంత్ కి పిచ్చ ఫ్యాన్ అన్న విషయం కొంతమందికే తెలుసు. 

మరింత సమాచారం తెలుసుకోండి: