ఇటీవల చైనా -భారత్ సరిహద్దు ప్రాంతం లడక్ వద్ద 20 మంది భారత సైనికులను చైనా ఆర్మీ చంపేయడం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా చైనా ఉత్పత్తులపై మరియు వస్తువుల పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత దేశ ప్రజలు చూపించడం జరిగింది. సోషల్ మీడియాలో బాన్ చైనా అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఈ విధంగా చైనా విషయం ట్రెండ్ అవుతున్న తరుణంలో కొంతమంది ఇండస్ట్రీలో అత్యుత్సాహం చూపించే సెలబ్రిటీలు ఈ విషయాన్ని అడ్డంపెట్టుకుని ఏదో ప్రేక్షకాదరణ పొందటానికి చిప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు.

 

చైనా వస్తువులను టీవీలను మరియు మొబైల్ ఫోన్లు పగలగొడుతు కొంత మంది సెలబ్రిటీలు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. తాజాగా ఈ విధంగానే బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ చేసిన వీడియో చూసిన నెటిజన్లు ఫుల్లుగా ట్రోల్ చేస్తున్నారు. పూర్తి మేటర్ లోకి వెళ్తే వస్తువులను పగలగొట్టే విషయంలో తాను కూడా ఉన్నాను అంటూ చైనా ఫోన్ ని నేలకేసి కొట్టి, దానిని డస్ట్ బిన్ లో వేసిన వీడియోను పోస్ట్ చేసాడు కౌశల్.

 

దీంతో కౌశల్ చేసిన పనికి చాలా మంది నెటిజన్లు సెటైర్లు వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. చైనాకు నష్టం చేయడం అంటే పాతవి పగలగొట్టుకోవడం కాదని, కొత్తవి కొనకుండా ఉండడం అనే మినిమం కామన్ సెన్స్ లేదంటూ కౌశల్ ని ట్రోల్ చేస్తున్నారు. నిజంగా దేశం మీద అంత భక్తి ఉంటే చైనా వస్తువులను పగలగొట్టడం కాదు… సరిహద్దులలోకి వెళ్ళి చైనా సైనికుల తలకాయ లను పగలగొట్టు అని కౌశల్ మీద సెటైర్లు వేస్తున్నరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: