సినిమాల్లో హీరోల హీరోయిజం మాత్రమే అనుకునే పరిస్థితిని మార్చిన హీరోయిన్ విజయశాంతి. ఆమె కెరీర్లో గ్లామర్ హీరోయిన్ గా ఎంతగా రాణించిందో.. హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రల్లో కూడా అంతగా రాణించింది నెంబర్ వన్ అయ్యారు. హీరోయిన్ పాత్రల్లో కూడా ఆమె చేసినన్ని డేరింగ్ అండ్ డాషింగ్ పాత్రలు ఆమెకు ముందు ఆమె తర్వాత మరెవరూ చేయలేదు. విజయశాంతి కోసమే పుట్టాయా అనిపించే ఎన్నో పాత్రలు ఆమె కెరీర్లో కీర్తి కిరీటాలుగా నిలిచిపోయాయి. నేడు ఆమె జన్మదినం.

IHG

 

తెలుగులో కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రాజశేఖర్.. వంటి స్టార్ హీరోలకు ఆమె తెరపై సరిజోడి. గ్లామర్, డ్యాన్స్, యాక్షన్, పైట్స్.. అన్నింటినీ సమపాళ్లలో చూపించిన నటి విజయశాంతి. ముఖ్యంగా.. విజయశాంతి చేసిన హీరోయిన్ బేస్డ్ సినిమాల్లో ఆమె చేసిన ఫైట్స్ చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఫైట్స్ లో ఆమె చూపించిన హావభావాలు, ఈజ్.. విజయశాంతి ఫైట్స్ చేసినట్టు కాకుండా ఆయా పాత్రలు చేసినట్టే ఉండేవంటే అతిశయోక్తి కాదు. కర్తవ్యం, ఒసేయ్.. రాములమ్మ, రౌడీ ఇన్ స్పెక్టర్, మగరాయుడు, పోలీస్ లాకప్ వంటి ఎన్నో సినిమాల్లో ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ ఇందుకు ఉదాహరణ.

IHG

 

యాక్షన్ లో ఆస్థాయి రోరింగ్ ఫెర్మార్మెన్స్ కేవలం ఆమెకు మాత్రమే సాధ్యమైందని చెప్పాలి. ప్రతిఘటనలో గొడ్డలి పట్టి విలన్ ని తెగ నరికినా, రేపటి పౌరులులో పిల్లలకు విద్యా బుద్దులు చెప్పి వారిలో ఆత్మస్థైర్యం నింపినా.. అవి విజయశాంతికి మాత్రమే చెల్లింది. సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలకు విజయశాంతి ఓ బ్రాండ్. ఎందరో హీరోయిన్లు చేసిన యాక్షన్ మూవీస్ కు విజయశాంతి ఆదర్శం అని చెప్పాలి. పవర్ ఫుల్, యాక్షన్ పాత్రలను విజయశాంతి ఆస్థాయిలో ప్రెజెంట్ చేయబట్టే ఆమెకు ‘లేడీ అమితాబ్’ అనే పేరు స్థిరపడిపోయింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: