కాస్టింగ్ కౌచ్ కావొచ్చు.. మీటూ కావొచ్చు.. ఫీమేల్ ఆర్టిస్టులు, హీరోయిన్స్ ఎదుర్కునే లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కరు ఒక్కోలా తమ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకుంటారు. కొందరు ఇలాంటి విషయాలు షేర్ చేయడానికి ఇష్టపడరు. కాని సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రం కొందరు ఎలాంటి భయాలు లేకుండా బయటపెట్టేస్తారు. ఇక వీరి లిస్ట్ లో చేరింది టాలీవుడ్ హీరోయిన్ రెజినా. ఎస్.ఎం.ఎస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజినా తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలని బాగా ప్రయత్నించింది.

 

అయితే కెరియర్ లో ఆమె ఎంచుకున్న సినిమాలు ఆమెను వెనకపడేలా చేశాయి. ఇక కాస్టింగ్ కౌచ్ మీద మీ స్పందన ఏంటని ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో అడిగితే తనకు లైంగిక వేధింపులు జరిగాయని.. తనని లొంగదీసుకోవాలని చాలామంది ప్రయత్నించారని అన్నది రెజినా. వాళ్లు కోరింది నేను ఇవ్వలేదు అందుకే తనని సినిమాల్లోంచి తొలగించారని చెప్పుకొచ్చింది. 

 

ఇక ప్రస్తుతం కెరియర్ లో తనదాకా వచ్చిన కథలను విని.. నచ్చితే ఓకే చేస్తున్నట్టు చెప్పిన రెజినా కన్నడలో ఇప్పుడే హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోనున్నట్టు చెప్పింది. ప్రస్తుతం మిస్టర్ చంద్రమౌళి సినిమాలో నటిస్తున్న రెజినా కెరియర్ లో ఇంకా చేయాల్సిన పాత్రలు చాలా ఉన్నాయని.. ఇప్పటికైనా సరే మంచి ఛాన్స్ వస్తే అవి చేస్తానని అంటుంది. మరి రెజినా కోరిన ఆ ఛాన్సులు త్వరలోనే ఆమెకు వచ్చి మళ్లీ ఇదివరకు క్రేజ్ తెచ్చుకోవాలని కోరుకుందాం. లాస్ట్ ఇయర్ ఎవరు సినిమాతో ప్రేక్షకులను అలరించిన రెజినా తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ సినిమాల్లో ఛాన్సులు అందుకుంటుంది. రకుల్ తో పాటుగా టాలీవుడ్ కెరియర్ ఆరంభించిన అమ్మడు స్టార్స్ తో నటించడంలో మాత్రం వెనుకపడ్డది.                          

మరింత సమాచారం తెలుసుకోండి: