కరోనా మహమ్మారి కారణంగా మూత పడ్డ థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో   తెలియనిపరిస్థితి. ఒకవేళ ప్రభుత్వ అనుమతులు లభించి థియేటర్స్ ఓపెన్ అయినా జనం వస్తారో రారో తెలియని అనిశ్చిత పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఎలా గట్టెక్కాలో  తెలియక తలలు పండిన ఫిలిం మేకర్స్ కూడ తీవ్రంగా ఆలోచిస్తున్నారు.  


ఈ పరిస్థితులలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు సినిమా ధియేటర్స్ కు ప్రత్యామ్నాయంగా మారాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం చాలా సినిమాలు ఒటీటీలో డైరెక్ట్‌గా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో కూడ ‘అమృతరామమ్’ అనే సినిమా డెరెక్ట్‌గా ఒటీటీలో విడుదలై తెలుగు సినిమాల నిర్మాతల ఆలోచనలను ప్రభావితం చేయడం మొదలుపెట్టింది.


అయితే టాప్ హీరోలు టాప్ హీరోయిన్స్ తమ సినిమాలను ఒటీటీ ప్లాట్ ఫామ్స్ పై విడుదల చేయడానికి అంగీకరించక పోయినా కీర్తి సురేశ్ మాత్రం తన ‘పెంగ్విన్’ ను డిజిటల్ మీడియా ద్వారా విడుదల కావడానికి అంగీకరించింది. గతవారం విడుదలైన ఈసినిమాకు మిశ్రమ స్పందన రావడంతో కీర్తి తన సినిమాలను ఇక ఒటీటీ ప్లాట్ ఫామ్స్ పై విడుదల చేయకూడదు అని నిశ్చయించుకున్నట్లు టాక్.


అయితే ఆమె మాటలను లెక్కచేయకుండా ఆమె నటించిన మరో లేటెస్ట్ మూవీ ‘మిస్ ఇండియా’ నిర్మాతలు కూడా తమ సినిమాను ఒటీటీ ప్లాట్ ఫామ్ పై విడుదల చేయడానికి అమెజాన్ నెట్ ఫ్లిక్స్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. వాస్తవానికి ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎప్రిల్ 17న విడుదల కావలసి  ఉంది. అయితే లాక్ డౌన్ కారణంగా విడుదలకాలేదు.  నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పై కూడా కీర్తికి భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడ ఒటీటీ ప్లాట్ ఫామ్ పై విడుదల అయితే తన పరిస్థితి ఏమిటి అని కీర్తి టెన్షన్ పడుతున్నట్లు టాక్. దీనితో కరోనా సమస్యల వల్ల కెరియర్ పరంగా పూర్తిగా నష్టపోయిన హీరోయిన్స్ లో కీర్తి సురేశ్ ప్రధమ స్థానంలో నిలుస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: