గత సంవత్సరం బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ వచ్చి చేరాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. ఆ తర్వాత సంవత్సరం చివర్లో వచ్చిన రూలర్ చిత్రం బాలక్రిష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తేలిపోయింది. దాంతో బాలయ్య మార్కెట్ బాగా పడిపోయింది. అయితే ప్రస్తుతం బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంపై అభిమానులు బాగా ఆశలు పెట్టుకున్నారు.

 

బాలయ్య- బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రం కావడంతో ఈ సినిమాపై బాలయ్య అభిమానులకి మంచి అంచనాలు ఉన్నాయి. బాలక్రిష్ణ 60వ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రం నుండి చిన్నపాటి టీజర్ ని రిలీజ్ చేసిన చిత్రబృందం అభిమానులకి మంచి గిఫ్ట్ ని అందించింది. నిమిషం పాటు ఉన్న టీజర్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. అప్పటి వరకూ ఈ సినిమాపై అసలేమాత్రం అంచనాలు లేని కామన్ ఆడియన్ కూడా టీజర్ చూసినప్పటి నుండి.. ఈ సారి బాలయ్య హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడని ఊహిస్తున్నారు.

 


ముఖ్యంగా ఈ టీజర్ లో బాలయ్య లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పంచెకట్టులో బాలయ్య డైలాగ్ చెబుతుంటే ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేసాయి. రూలర్ సినిమాలో బాలయ్య లుక్ బాలేదన్న వారందరూ ఈ సినిమాలో బాలయ్య లుక్ చూసి ఆహా అంటున్నారు. ఈ టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి అభిమానుల సందడి మామూలుగా లేదు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, వీడియోస్ తో హల్చల్ చేస్తున్నారు.

 

ప్రస్తుతం ఒక ఫ్యాన్ మేడ్ టీజర్ యూట్యూబ్ లో సందడి చేస్తుంది. బీబీ3 టీజర్ ని యానిమేషన్ రూపంలో తీసుకొచ్చిన అభిమానులు మరో మారు మంచి ట్రీట్ ఇచ్చారు. మొత్తానికి ఇంకా టైటిల్ నిర్ణయింపబడని బీబీ3 చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ నిర్మాతకి ఆనందాన్ని కలుగజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: