విజయశాంతి పేరు వింటే వీరోచిత పోరాటాలు,  అందాల ఆరబోతలు వెంటనే తెలుగు ప్రజలకు గుర్తొస్తాయి. భారత దేశ సినీ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును దక్కించుకున్న హీరోయిన్ గా విజయశాంతి నిలిచారు అంటే అతిశయోక్తి కాదు. హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్న విజయశాంతి హీరోలతో సమానమైన పారితోషకం కూడా తీసుకుని అప్పట్లో తెలుగు పరిశ్రమని ఒక ఊపు ఊపారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల తర్వాత ఎక్కువ స్టార్డమ్ ని సంపాదించిన విజయశాంతి ఈరోజు అనగా జూన్ 24న తన 54 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె బాల్యం గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

IHG
1966 జూన్ 24న శ్రీనివాస్ ప్రసాద్, వరలక్ష్మి లకు శాంతి(విజయశాంతి) తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. విజయశాంతి పూర్వీకులు వరంగల్ జిల్లాలోని రామన్నగూడెం లో నివసించేవారు కానీ అప్పట్లో రజాకారులకు విజయశాంతి పూర్వీకులకు పెద్ద గొడవలు అయ్యాయి. దాంతో ఆ రజాకారులు వీరి కుటుంబాన్ని చంపేందుకు వస్తున్నారని తెలిసి విజయశాంతి తాతయ్య అప్పటికప్పుడు సామాన్లను సర్దుకొని తమిళనాడులోని మద్రాసుకి తరలిపోయారు. అయితే వీరి కుటుంబం మద్రాసు వచ్చిన తర్వాతనే విజయశాంతి పుట్టారు. అందుకే విజయశాంతి వరంగల్ జిల్లాకు చెందిన హీరోయిన్ అని చాలా తక్కువ మందికి తెలుసు.

IHG
విజయశాంతి తల్లికి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వారిలో ఒకరి పేరు విజయలలిత కాగా... ఆమె ద్వితీయ కథానాయికి గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించేవారు. ఈ కారణంగానే విజయశాంతి ఇంట్లో సినిమా వాతావరణం ఎప్పుడూ నెలకొనేది. విజయశాంతి తండ్రి శ్రీనివాస్ ప్రసాద్ కి కూడా సినీ పరిశ్రమ అంటే చాలా ఇష్టం ఉండేది. ఆ ఇష్టంతోనే తన కూతురు ని సినిమా హీరోయిన్ చేయాలని బాగా తపన పడేవాడు. తన తండ్రి కోరిక తీర్చేందుకే విజయశాంతి సినిమాలో రంగ ప్రవేశం చేసి గొప్ప హీరోయిన్ గా ఎదిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: