దేశం మొత్తం ఇప్పుడు కరోనా కష్టకాలంలో ఉంది.  ఇప్పటి వరకు  2.58 లక్షల మంది కరోనా బారి నుంచి కోలుకున్నారని, రికవరీ రేటు 56.7 శాతంగా ఉందని వివరించింది. కాగా, నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 15,968 మంది కరోనా బాధితులుగా మారగా, 465 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలుపుకుని దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య  4,56,183కు పెరగ్గా 14,476  మృతి చెందారు.  ప్రపంచంలో ప్రతి మనిషికి ఇప్పుడు బట్టలు వేసుకోవడం ఎంతో ముఖ్యమో.. బయటకు వస్తే మాస్క్ ధరించడం, శానిటైజర్ దగ్గర ఉంచుకోవడం అంత ముఖ్యమైంది. మందు లేని ఈ మాయ‌రోగం బారిన ప‌డ‌కుండా ఉండాలి అంటే మాస్క్ ఒక్క‌టే శ్రీరామ‌ర‌క్ష అని ఎక్స్‌ప‌ర్ట్స్ చెబుతున్నారు.

 

తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ హిందీలో మాస్క్‌ని ఏమ‌ని పిలుస్తారో వివ‌రించారు. గులాబో సితాబో మూవీ మాస్క్ ధ‌రించిన అమితాబ్ .. మాస్క్‌ని హిందీలో నాసికాముఖ‌సంర‌క్ష‌క కీటానురోధ‌క‌ వాయుఛాన‌క‌ వ‌స్త్ర‌డోరీయుక్త‌ప‌ట్టీ అని పిలుస్తార‌ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాస్క్ కేవలం కరోెనా గురించి మాత్రమే కాదు బయట పొల్యూషన్ నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని ఆయన అన్నారు.

 

కాగా, క‌రోనా వ‌ల‌న థియేట‌ర్స్ ఓపెన్ కాక‌పోవ‌డంతో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఆయుష్మాన్ ఖురానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సూజిత్ స‌ర్కార్ తెర‌కెక్కించిన గులాబో సితాబో చిత్రం ఓటీటీలో విడుదలైంది. జూన్ 12న విడుద‌లైన ఈ కామెడీ డ్రామాకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  ప్రస్తుతం ముంబాయి కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: