టెలివిజన్ తెరపై వార్తలు చెప్పే పంథాని మార్చిన వారిలో బిత్తిరి సత్తి ఒకరు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ లో తెలంగాణ మాండలికంలో వార్తలు వినిపించిన బిత్తిరిసత్తి ఆ తర్వాత ఆ ఛానెల్ కి స్వస్తి చెప్పి టీవీ 9 లో చేరిన సంగతి తెలిసిందే. టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకి కనిపించాడు.  అయితే తాజా సమాచారం ప్రకారం బిత్తిరి సత్తి టీవీ 9కి రాజీనామా చేశాడని అంటున్నారు.

 

నిన్నటికి నిన్న ఈ వార్త సెన్సేషన్ అయింది. అయితే బిత్తిరి సత్తి బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్ గా రాబోతున్నాడట. తెలుగు టెలివిజన్ పై బిగ్ బాస్ షోకి ఉన్న పాపులారిటీ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షో నాలుగవ సీజన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం బిగ్ బాస్ ఉండదని అనుకున్నారు.

 

కానీ టెలివిజన్ లో వచ్చే ప్రోగ్రామ్స్ , సీరియల్స్ షూటింగులకి అనుమతులు వచ్చిన నేపథ్యంలో బిగ్ బాస్ యాజమాన్యం కంటెస్టెంట్ల వేటలో పడింది. అయితే బిత్తిరిసత్తి టీవీ 9కి రాజీనామా చేసాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ వారిని అప్రోచ్ అయ్యాడని సమాచారం. తెలుగు బుల్లితెర మీద పాపులర్ ఫేస్ అయిన బిత్తిరిసత్తిని కంటెస్టెంట్ గా తీసుకోవడానికి బిగ్ బాస్ యాజమాన్యం పాజిటివ్ గానే ఉందట.

 

మరి ఈ విషయమై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. బిగ్ బాస్ షో స్టార్ట్ అయితే తప్ప కంటెస్టెంట్స్ ఎవరనే విషయం బయటకి తెలియదు. బిత్తిరి సత్తి కూడా ఈ విషయమై స్పందించే అవకాశం లేదని తెలుస్తుంది. నాలుగవ సీజన్ బిగ్ బాస్ కి సైతం నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: