మహేష్ ఎప్పుడు అయితే సినిమాల నిర్మాణ రంగంలో అడుగు పెట్టాడో అక్కడి నుంచి కూడా ఆయన భార్య నమ్రత ఆయన సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన  సినిమాలకు సంబంధించిన ప్రచారం నుంచి ప్రతీ ఒక్కటి కూడా ఆమె దగ్గర ఉండి చూస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఆయన శ్రీమంతుడు సినిమా నుంచి తన సినిమాలను తానే నిర్మిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు నమ్రత నిర్మాతలకు అనేక షరతులు పెడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలను నిర్మించే విషయంలో ఆమె అనేక కండీషన్ లు పెట్టడం వివాదాస్పదంగా మారింది. 

 

దీనితో అగ్ర నిర్మాతల నుంచి చిన్న నిర్మాతల వరకు అందరూ కూడా ఇప్పుడు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆమె ప్రతీ ఒక్కటి కూడా కమర్షియల్ అనే కోణం లో చూస్తుంది అని కొందరు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహేష్ సినిమా విషయంలో ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. సినిమాకు సంబంధించి హైదరాబాద్ హక్కులు మొత్తం తమకు కావాలి అని ఆమె డిమాండ్ చేసింది. దీనితో నిర్మాతలు షాక్ అయ్యారు. వాస్తవానికి సినీ పరిశ్రమకు హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. 

 

ఇప్పుడు హైదరాబాద్ హక్కులను మొత్తం ఆమెకు ఇస్తే తాము నష్టపోయే అవకాశం ఉంది అని నిర్మాతలు భావిస్తున్నారు. ఇదే విషయం మహేష్ దృష్టి కి కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళారు అని సమాచారం. తాము ఇలా అయితే సినిమా చేయలేము అని వారు చెప్పారు అని సమాచారం. మరి దీనిపై మహేష్ ఎం చేస్తాడు అనేది చూడాలి. మరి మహేష్ కి తెలియకుండానే ఈ నిర్ణయం తీసుకుంటుందా అంటూ టాలీవుడ్ లో కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: