కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు మాస్క్ ల అవసరం అనేది చాలా ఉంది ప్రపంచానికి. అసలు మాస్క్ లేకుండా ఏది కూడా జరిగే అవకాశాలు దాదాపుగా లేవు అనే చెప్పాలి. తాజాగా మాస్క్ ల విషయంలో సినీ పరిశ్రమ కూడా చాలా విధాలుగా సహాయ సహకారాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అందిస్తున్నాయి. మాస్క్ లను తయారు చేసి ఇచ్చే కార్యక్రమాన్ని కొందరు సినీ రాజకీయ పెద్దలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తుంది మెగా కోడలు ఉపాసనా. ఆమె ఇటీవల తెలంగాణా సర్కార్ కి ఒక విజ్ఞప్తి చేసింది అని సమాచారం. 

 

గాంధీ ఆస్పత్రికి 50 లక్షల మాస్క్ లు, అదే విధంగా తెలంగాణాలో ఉన్న ఇతర ఆస్పత్రులకు 50 లక్షల మాస్క్ లు ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నాను అని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహాకారాలు కావాలి అని ఆమె చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి తెలంగాణా సర్కార్ కూడా ఓకే చెప్పింది అని టాక్. మాస్క్ లను పంపిణీ చేయడానికి గానూ గ్రామాల్లో ఉన్న డ్వాక్రా మహిళల నుంచి సహకారం కావాలి అని ఆమె వివరించగా దానికి తెలంగాణా సర్కార్ ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. 

 

కోటి మాస్క్ లను మొదటి విడతలో 25 లక్షలు రెండో విడతలో 25 లక్షలు మూడో విడతలో 30 లక్షలు నాలుగో విడతలో 20 లక్షల మాస్క్ లను ఇవ్వడానికి గానూ ఆమె సిద్దమైంది అని సమాచారం. వీటిని వచ్చే రెండు నెలల్లో ఇస్తాను అని చెప్పింది అని టాక్. చూడాలి మరి ఎన్ని ఇస్తారు అనేది. ఇక సామాన్య ప్రజలకు కూడా మాస్క్ లను డ్వాక్రా సంఘాల ద్వారా ఇప్పించే ప్రయత్నం ఆమె చేస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: