హిట్ కాంబినేషన్ కు క్రేజ్ ఎక్కువ. హిట్ కాంబినేషన్ ఎప్పుడెప్పుడా అని అభిమానులే కాదు.. అందరూ ఎదురు చూస్తుంటారు. సక్సెస్ ఫుల్ కాంబినేషన్ రిపీట్ అయితే.. ఎన్నో లాభాలున్నా.. దానితో పాటు రిస్క్ కూడా ఉంటుంది. గతంలో వచ్చిన హిట్ ను మరిపిస్తేనే. ఏమాత్రం తగ్గినా.. రిజక్ట్ చేస్తారు. 

 

మనస్టార్స్ చాలా మంది హాట్ కాంబినేషన్స్ కే ఓటేస్తున్నారు. సక్సెస్ ఇచ్చిన దర్శకులకే మళ్లీ ఛాన్స్ ఇస్తే.. హిట్ ఇస్తారన్న నమ్మకం కాబోలు. బాలకృష్ణ ఫ్లాపుల్లో ఉన్న ప్రతీసారీ బోయపాటి హిట్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సింహా.. లెజెండ్ ఘన విజయం సాధించాయి. ఇప్పుడీ కాంబినేషన్ హ్యాట్రిక్ పై కన్నేసింది. 

 

బాలకృష్ణ, బోయపాటి సినిమాకు మోనార్క్ అనే టైటిల్ అనుకున్నారు. నందమూరి ఫ్యాన్స్ బోయపాటిపై చాలా నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని టీజర్ తో నిలబెట్టుకున్నాడు దర్శకుడు. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ గా తెరకెక్కుతోంది. ఇది రిస్కే అయినా.. ఈ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో సాహసం చేస్తున్నాడు నిర్మాత రవీంద్రరెడ్డి. 

 

బన్నీ తనకు హిట్ ఇచ్చిన దర్శకులకే ఛాన్సులిస్తున్నాడు. గంగోత్రితో హీరోగా పరిచయమైన బన్నీ ఆర్యతో క్రేజీ హీరో అయ్యాడు. సుకుమార్ దర్శకత్వంలో రెండో మూవీ ఆర్య 2నిరాశపరిచినా.. మ్యూజికల్ గా ఆకట్టుకుంది. పదేళ్ల విరామం తర్వాత సుకుమార్.. బన్నీ కలయికలో పుష్ప రూపొందుతోంది. 

 

పవన్ తనకు హిట్ ఇచ్చిన ప్రతీ దర్శకుడికి రెండో ఛాన్స్ ఇస్తాడు. పూరీతో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు.. కరుణాకర్ దర్శకత్వంలో తొలిప్రేమ, బాలు సినిమాలు చేశాడు. ఇక పవన్, త్రివిక్రమ్ కాంబోలో జల్సా, అత్తారింటికి దారేది.. అజ్ఞాతవాసి వచ్చాయి. ఫ్లాపుల్లో ఉ్నన టైమ్ లో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్. ఈ ప్రాజెక్ట్ 2021 సెకండాఫ్ లో సెట్స్ పైకి రానుంది. 

 

ఇక ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పని లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఈ ఇద్దరూ ఒకేసారి సక్సెస్ చూశారు. ఆ తర్వాత సింహాద్రితో ఇద్దరూ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఈ కలయికలో మూడో సినిమాగా యమదొంగ తెరకెక్కింది. ప్రస్తుతం నాలుగో సినిమా ట్రిపుల్ ఆర్ రూపొందుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: