కొంచెం లేట్ అయినా.. భారీ టార్గెట్ తో వస్తున్నాడు పూరీ జగన్నాథ్. డ్రీమ్ ప్రాజెక్ట్ ను లార్జ్ స్కేల్ లో తెరకెక్కించేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నాడు. ఎన్నాళ్ల నుంచో పేపర్ మీదున్న కథను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రిపేర్ అయ్యాడు. అయితే ఈ స్టోరీలో హీరో ఎవరు అనేది ఆసక్తిగా మారింది. 

 

ఫుల్ స్పీడ్ గా సినిమాలు తీసే పూరీ జగన్నాథ్ ఓ ప్రాజెక్ట్ ని మాత్రం చాలా కాలంగా పెట్టెలో దాచుకున్నాడు.  టైటిల్ కూడా ఫిక్స్ చేసి స్టోరీ లాక్ చేసుకున్నాడు. జనగణమన పేరుతో ఓ సినిమా తీయాలని ప్లాన్ చేశాడు. అయితే చాలా రోజుల తర్వాత.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు పూరీ. జనగణమన ని పాన్ ఇండియన్ మూవీగా తీస్తానని త్వరలోనే సినిమా లాంచ్ చేస్తానని ప్రకటించాడు. 

 

పూరీ జగన్నాథ్ ఇంతకుముందు మహేశ్ బాబుతో జనగణమన తీస్తాడని ప్రచారం జరిగింది. అయితే కొన్నాళ్ల కిందట మహేశ్ బాబు గురించి పూరీ చేసిన కామెంట్స్ సినీ జనాలను ఆశ్చర్యపరిచాయి. మహేశ్ బాబు సక్సెస్ లో ఉన్న డైరెక్టర్స్ నే పట్టించుకుంటాడని కామెంట్ చేశాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఇష్యూస్ ఉన్నాయనే ప్రచారం మొదలైంది. అలాగే మహేశ్ తో జనగణమన తీయడనే టాక్ మొదలైంది. 

 

పూరీ జగన్నాథ్ ఇప్పుడు హిందీ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ తో మెప్పించాలనుకుంటున్నాడు. విజయదేవరకొండతో మల్టీ లింగ్వల్ తీస్తున్నాడు. సో ఇప్పుడు జనగణమన సినిమాను పాన్ ఇండియన్ మూవీగా తీస్తాని చెప్పేసరికి హీరో ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది.

 


పూరీ జగన్నాథ్ పాన్ ఇండియన్ సినిమా తీయాలంటే నలుగురు హీరోలు టాప్ ప్రియారిటీలో కనిపిస్తున్నారు. ఆల్ రెడీ బాలీవుడ్ కు వెళ్లినవాళ్లు.. బాలీవుడ్ కు వెళ్లబోతున్న హీరోలు మార్కెట్ లెక్కల్లో ముందున్నారు. అయితే ఎప్పుడూ సర్ ప్రైజింగ్ ప్యాకేజీలతో ఎంటర్ టైన్ చేసే పూరీ ఎవరితో జనగణమన పాడిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. 


టాలీవుడ్ లో పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ప్రభాస్. బాహుబలితో నార్త్ లోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సాహో సినిమాతో ఉత్తరాదిన 100 కోట్లకు పైగా వసూలు చేసి, మార్కెట్ మరింత పెంచుకున్నాడు. ఇక ఈ హీరో పూరీతో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు చేశాడు. 

 

ప్రభాస్ రూట్ లోనే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా భారీ హిస్టారికల్ డ్రామాతో బాలీవుడ్ కి వెళ్తున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో తారక్, చరణ్ ఇద్దరూ నార్త్ మార్కెట్ కి వెళ్తున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ పై బాలీవుడ్ లోనూ సూపర్ బజ్ ఉంది. సో వీళ్లు పూరీ జగన్నాథ్ జనగణమనకి ప్లస్ అవుతారని చెప్పొచ్చు. చరణ్ పూరీ డైరెక్షన్ లో చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక పూరీతో తారక్ ఆంధ్రావాలా, టెంపర్ సినిమాలు చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: