ఇటీవల బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవటం అందరిని కలచివేసింది. జరిగిన ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు ఇండస్ట్రీకి చెందిన పెద్దలు తీవ్ర స్థాయిలో విచారణ వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుకాల బాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తు ‘నెపోటిజం’ పేరిట ఆందోళనలు నిరసనలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా స్పందించింది. నెపోటిజం పై భారీ ఎత్తున ఆందోళనలు  జరుగుతున్న నేపథ్యంలో రేణుదేశాయ్ స్పందిస్తూ…నెపోటిజం ప్రతి చోట ఉంటుందని, టాలెంట్ ఉండి ధైర్యంగా నిలబడగలిగితే దాన్ని జయించవచ్చని రేణు అభిప్రాయపడింది.

IHG't Pick Sushant Call, A Day Before Suicide!

ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అని అర్థమవుతోందని ఆమె అంది.   మంచి టాలెంట్ ఉంది కాబట్టే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమా రంగంలో మంచి విజయం సాధించడం జరిగిందని, మంచి స్థాయి అందుకున్నాడని కానీ కొన్ని విషయాలు మైండ్ లో బ్యాలెన్స్ చేయలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య ఘటనకు పాల్పడి ఉండి ఉండొచ్చని రేణు దేశాయ్ తన అభిప్రాయాన్ని తెలిపింది. అంతే కాకుండా కేవలం కుటుంబాన్ని నమ్ముకొని సినిమా ఇండస్ట్రీలోకి రావద్దని…. ఆర్టిస్టులకు మనోధైర్యం కూడా ఉండాలని తెలిపింది. దీంతో నెటిజన్లు మరి రేపు మీ అబ్బాయి అఖిరా నందన్ మీరు చెప్పిన మాటలు బట్టి చూస్తే హీరో అవ్వడం కష్టమే కదా రేణు అని ప్రశ్నిస్తున్నారు.

IHG

కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నెపోటిజం ఉంది  రేణు గారు…. మీకు తెలిసే ఉండి ఉండొచ్చు, ఒక కుటుంబం నుండే డజను, అరడజను మంది హీరోలు ఇండస్ట్రీని కబ్జా చేసి తామే హీరోలు అన్నట్టుగా కొని ఫ్యామిలీ లు సెటిల్ అయిపోయాయి. అలాంటి వాళ్ళు ఉండబట్టే సుశాంత్ సింగ్ లాంటి టాలెంట్ ఉన్ననటులు చనిపోతున్నారు, అయినా ఇండస్ట్రీకి చెందినవారిని విమర్శిస్తే ఏముంటుంది జనాల్లో మార్పు రావాలని నెటిజన్లు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: