తెలుగు సినిమాల్లో మాస్ కంటెంట్ కు ఎంతటి ప్రేక్షకాదరణ ఉంటుందో తెలిసిన విషయమే. సీనియర్ హీరోలు తమ మాస్ ఇమేజ్ ను కంటిన్యూ చేస్తే యువ హీరోలు మాస్ ఇమేజ్ ఉండే మంచి సినిమాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక్కసారి మాస్ ఇమేజ్ వస్తే ప్రేక్షకుల్లో వచ్చే గుర్తింపే వేరు. యువ హీరో జొన్నలగడ్డ హరికృష్ణ ఇదే తరహాలో నటించిన మాస్ మూవీ ‘ఆటో రజినీ’. దాదాపు రెండేళ్ల క్రితం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ అనే లవ్ సబ్జెక్ట్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ యువ హీరో రెండో సినిమాతో మాస్ బాట పట్టాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు రివీల్ చేశారు.

IHG

 

ఏపీ మంత్రి కొడాలి నాని చేతుల మీదుగా ‘ఆటో రజినీ’ సినిమా ఫస్ట్ లుక్ ను రివీల్ చేసింది చిత్ర యూనిట్. సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన కొడాలి నాని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ఆటో రజిని' సినిమా ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వాదంతో ప్రారంభమైంది. ఇప్పుడు ఫస్ట్ లుక్ మంత్రి కొడాలి నాని రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు నచ్చే అంశాలతో సినిమాను తెరకెక్కించాం’ అన్నారు.

IHG

 

తొలి సినిమాతో డ్యాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకున్న హరికృష్ణ ఈ సినిమాతో పూర్తి మాస్ లుక్ లో కనిపించనున్నాడు. కమర్షియల్ హంగులతో తెరకెక్కించిన ఈ సినిమాతో తనకు ప్రేక్షకుల్లో గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.  శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజేస్ బ్యానర్  పై జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. పరిస్థితులు చక్కబడ్డాక సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: