సినిమాలే జీవితం.. సినిమాలే ప్రాణం అంటూ వెండితెరను ఆరాధించిన డైెరెక్టర్స్ మనసు మార్చుకున్నాడు. దీనికి కరోనానే కారణం. లాక్ డౌన్ టైమ్ లోదర్శకులు ఖాళీగా కూర్చోకుండా.. సైడ్ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారు.

 

కరోనా తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఓటీటీ.. వెబ్ సిరీస్ లాంటి మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. థియేటర్స్ మూతబడటంతో.. చాలామంది దృష్టి వీటిపై పడింది. యంగ్ హీరోహీరోయిన్లతో పాటు స్టార్స్ ను సైతం వెబ్ సిరీస్ ఎట్రాక్ట్ చేస్తోంది. దర్శకులు కూడా వీళ్ల బాటలోనే పయనిస్తున్నారు. ఖాళీగా ఉన్నామని కొందరు.. ఛాన్సుల్లేవని మరికొందరు వెబ్ సిరీస్ వైపు చూస్తున్నారు. ఈ లిస్ట్ లో గుణశేఖర్ కూడా చేరాడు. 

 

భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ మెగా ఫోన్ పట్టి ఐదేళ్లయింది. 2015లో వచ్చిన రుద్రమదేవి తర్వాత రానాతో మైథలాజికల్ మూవీ హిరణ్య కశ్యప ప్లాన్ చేశాడు. రెండేళ్ల నుంచి  ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉంటూ.. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు దర్శకుడు. 200కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలనుకుంటున్నాడు. హిరణ్య కశ్యపను ఎనౌన్స్ చేసి చాలా కాలం కావడంతో.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టేనని వస్తున్న వార్తలను గుణశేఖర్ రీసెంట్ గా సామాజిక మాధ్యమంలో ఖండించాడు. సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే.. షూటింగ్ మొదలవుతుందన్నాడు గుణశేఖర్. 

 

హిరణ్య కశ్యప క్యాన్సిల్ కాకపోయినా.. ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. రానా ఆగస్ట్ 8న ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆ తర్వాత షూటింగ్ సగంలో ఆగిపోయిన విరాటపర్వం పూర్తి చేస్తాడు. ఈ లెక్కన ఆరు నెలల్లో రానా మరో మూవీ చేసే అవకాశం లేదు. దీంతో.. హిరణ్య కశ్యప మొదలుపెట్టేలోగా.. ఓ వెబ్ సిరీస్ ను స్వీయ దర్శకత్వంలో నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నాడు గుణశేఖర్. 

 

షార్ట్ ఫిలింస్ తో కెరీర్ స్టార్ట్ చేసిన తరుణ్ భాస్కర్.. ఈ నగరానికి ఏమయింది ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం మీకు మాత్రమే చెప్తా టీవీ షోకు హోస్ట్ గా పనిచేస్తున్నాడు. వెంకటేశ్ కథ కోసం కథ రాసుకున్నా.. హీరో నటిస్తున్న నారప్ప పూర్తి కావాల్సి ఉంది. ఈ లోగా.. వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడు తరుణ్ భాస్కర్. 

మరింత సమాచారం తెలుసుకోండి: