పెళ్లి చేసుకోవడానికి అమ్మాయికైతే 18ఏళ్లు. అబ్బాయిలకైతే 21ఏళ్లు దాటాలి. 18ఏళ్లు దాటిన తర్వాత ఈ ఏజ్ లోపు పెళ్లి చేసుకోవాలన్న నిబంధన ఏమీ లేకపోవడంతో.. మన ముద్దుగుమ్మలు పెళ్లి అనే మాటే మర్చిపోయారు. స్టార్ హీరోయిన్స్ చాలామంది 30ప్లస్ లోకి వచ్చేశారు. ముద్దుగుమ్మల వాలకం చూస్తుంటే.. ఇంకో పదేళ్లు సోలోగా బతికేద్దామనుకుంటున్నారు. 

 

వయసులో ఉన్నప్పుడే.. పెళ్లి చేసుకోవాలంటారు. అయితే ఈ మాట హీరోయిన్స్ కు వర్తించదు. వయసులో ఉన్నప్పుడు.. ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉండిపోతారు. వరుస ఆఫర్స్ వచ్చి పడేసరికి పెళ్లి అనే మాటే మర్చిపోతారు. మధ్యలో ఎప్పుడైనా గుర్తుకొచ్చినా.. ప్రొఫెషనలిజం పెళ్లిని డామినేట్ చేస్తుంది. వెనక్కి తిరిగి చూసుకునే సరికి 30ఏళ్లు నిండిపోతున్నాయి. 

 

పెళ్లి కావాల్సిన హీరోయిన్లలో పెద్దది అనుష్క. పెళ్లెప్పుడని అడిగిన ప్రతీసారి.. త్వరలో అంటూ తప్పించుకుంటోంది. ఈ లోగా అతనితో పెళ్లి.. ఇతనితో పెళ్లంటూ చాలా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ లోగా ఒంటిమీదకు 38ఏళ్లు వచ్చిపడ్డాయి. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలకు అనుష్కే మెయిన్ ఆప్షన్ అయిపోయింది. దీంతో ఒకదాన్ని మించిన పాత్రలు దక్కుతున్నాయి. సాధ్యమైనన్ని ఎక్కువ చిత్రాల్లో నటించి గుడ్ బై చెప్పాలనుకుంటోంది అనుష్క. 

 

త్రిష అందరిలాంటి అమ్మాయి కాదు. ప్రేమించు పెళ్లాడు టైటిల్ ను ఆదర్శంగా తీసుకొని.. బిజినెస్ మేన్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంది. ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. అయితే పెళ్లి తర్వాత నటించకూడదని ప్రియుడి ఫ్యామిలీ నుంచి ఒత్తిడి వచ్చేసరికి.. బ్రేకప్ చెప్పేసి..మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయింది. వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్న త్రిషను చూస్తుంటే.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదు. 37ఏళ్ల త్రిష పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతుందో మరి. 

 

అందరిదీ ఒక ప్రాబ్లమ్ అయితే.. నయనతారది మరో ప్రాబ్లమ్. దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ఐదేళ్లుగా ప్రేమిస్తూ.. పెళ్లి వార్తలను ఎంజాయ్ చేస్తోందే గానీ.. నోరు మెదపడం లేదు. నా పిల్లల తల్లి అంటూ.. నయనతార స్టిల్ విఘ్నేశ్ శివన్ పోస్ట్ చేయడంతో.. ఈ ఇద్దరి పెళ్లి ఎంతో దూరం లేదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: