సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుగా చిన్నతనంలో పలు సినిమాల్లో బాలనటుడిగా నటించి మంచి పేరు దక్కించుకున్నారు. ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక రాజకుమారుడు సినిమాతో హీరోగా మారిన మహేష్, తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని, అక్కడి నుండి వరుసగా అవకాశాలతో మంచి సక్సెస్ లతో టాలీవుడ్ సూపర్ స్టార్ గా మారారు. తండ్రి కృష్ణకు తగ్గ తనయుడిగా ప్రస్తుతం టాలీవుడ్ బడా స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్న మహేష్, తన కెరీర్ లో తొలిసారిగా విక్టరీ వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించడం జరిగింది. 

IHG's Shocking ...

ఇక నందమూరి ఫ్యామిలీ నుండి మూడవ తరం నటుడిగా ముందుగా బాలరామాయణం సినిమా ద్వారా బాలనటుడిగా అరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత పెరిగి పెద్దయ్యాక నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారారు. ఆ తరువాత నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని, వాటిని హిట్స్ గా మలుచుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ బడా స్టార్స్ లో ఒకరిగా ఈ నందమూరి యంగ్ టైగర్ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఎప్పటినుండో అటు ఘట్టమనేని, ఇటు నందమూరి ఫ్యాన్స్ ఇద్దరూ కూడా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ఒక సినిమా వస్తే చూడాలని ఎంతో ఆశపడుతున్నారు. 

 

వాస్తవానికి ఇటీవల మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ ఇద్దరు స్టార్ నటులు కూడా ఒకే స్క్రీన్ పై మెరిస్తే నిజంగా బాక్సాఫీస్ రచ్చ రచ్చే అని, అలానే ఆ సినిమాతో ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా బద్దలవ్వడం ఖాయం అని పలువురు ప్రేక్షకుల తో పాటు ఈ ఇద్దరు హీరోల అభిమానులు అంటున్నారు. మరి ఈ ఇద్దరినీ ఒకే సినిమాలో చూపించే దర్శకుడు ఎవరో, అసలు ఈ ఇద్దరి కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో తెలియాలి అంటే మాత్రం, దానికి కాలమే సమాధానం చెప్పాలి......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: