టాలీవుడ్ సీనియర్ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ ముందుగా తేనెమనసులు సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్న కృష్ణ, ఆ తరువాత నుండి తన టాలెంట్ తో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుని అనతికాలంలోనే మంచి హీరోగా పేరు ప్రఖ్యాతలు గడించారు. ఇక ఆ తరువాత నుండి ఎన్నో గొప్ప హిట్ సినిమాల్లో నటించిన కృష్ణ, అప్పట్లో అతి పెద్ద మాస్ హీరోగా బ్రహ్మాండమైన ఇమేజ్ ని సొంతం చేసుకోవడం జరిగింది. తన కెరీర్ లో మొత్తంగా 350కి పైగా సినిమాల్లో నటించిన కృష్ణ నటవారసుడిగా ముందుగా ఆయన పెద్ద తనయుడు రమేష్ బాబు సినిమాల్లోకి హీరోగా అరంగేట్రం చేసినప్పటికీ, ఆశించిన రేంజ్ లో ఆయనకు సక్సెస్ లు లభించలేదు. 

IHG

ఇక చిన్నతనం నుండి సినిమాల్లో నటిస్తూ వస్తున్న కృష్ణ చిన్న తనయుడు మహేష్ బాబు, కొంత గ్యాప్ తీసుకుని పెరిగి పెద్దయ్యాక రాజకుమారుడు సినిమాతో హీరోగా మారారు. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ హిట్ అందుకున్న మహేష్, ఆ తరువాత నుండి వరుసగా అవకాశాలతో ఎన్నో మంచి హిట్స్ తో విపరీతమైన క్రేజ్, ఫ్యాన్స్ ని సంపాదించారు. ప్రస్తుతం తండ్రికి తగ్గ తనయుడిగా సూపర్ స్టార్ గా గొప్ప హోదాలో మహేష్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే మొదటి నుండి ఘట్టమనేని అభిమానుల కోరిక ఏంటంటే, మహేష్, కృష్ణ ఇద్దరూ కూడా కలిసి మంచి హిట్ సినిమా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. వాస్తవానికి మహేష్ ఫస్ట్ మూవీ రాజకుమారుడు సినిమాలో ఆయనకు తండ్రిగా కృష్ణ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో కనిపిస్తారు. 

 

ఆ తరువాత మహేష్ మూడవ సినిమా వంశీ లో ఆయనకు మావయ్యగా కృష్ణ నటించినప్పటికీ, ఆ సినిమా అప్పట్లో పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఆ ఇద్దరు సూపర్ స్టార్స్ కనుక రాబోయే రోజుల్లో ఒక మంచి సినిమాలో నటిస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కొంతవరకు జరుగకపోవొచ్చని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇటీవల విజయనిర్మల మరణంతో కృంగిపోవడంతో పాటు, వయసు కూడా మీద పడడంతో కృష్ణ ఇకపై సినిమాల్లో కనిపించే అవకాశం తక్కువని అంటున్నారు. ఒకవేళ అన్ని కలిసివచ్చి ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కనుక ఒకే సినిమాలో నటిస్తే, నిజంగా ఆ సినిమా రికార్డ్స్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే......!!

మరింత సమాచారం తెలుసుకోండి: