రోజుకో కొత్త హీరోయిన్ పరిచయమవుతున్న టాలీవుడ్ లో వెటరన్ హీరోలకు మాత్రం ప్రతి సినిమాకు హీరోయిన్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150తో రీ ఎంట్రీ ఇవ్వగా అందులో హీరోయిన్ గా కాజల్ ను ఎంపిక చేసే క్రమంలో చాలామందిని అనుకున్నారట. సైరాకు ఎలాగు నయనతార మెప్పించింది. మళ్లీ కొరటాల శివతో చేస్తున్న ఆచార్య సినిమాకు చిరు సరసన త్రిష నటిచాల్సి ఉన్నా ఆమె కాదని చెప్పడంతో మళ్లీ చివరకు కాజల్ నే ఎంపిక చేసుకున్నారు. 

 

ఇక చిరు పరిస్థితి అలా ఉంటే నందమూరి నట సిం హం బాలకృష్ణ సరసన నటించడానికి కూడా హీరోయిన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బాలయ్య బాబు ప్రతి సినిమాకు హీరోయిన్ సమస్య ఉంటుంది. లేటెస్ట్ గా బోయపాటి శ్రీను డైరక్షన్ లో తెరకెక్కుతున్న బిబి 3 సినిమాకు కూడా ముందు కాజల్ ను హీరోయిన్ గా అనుకున్నారు ఆమె రెండున్నర కోట్లు ఇస్తే చేస్తా అన్నదట. బాలకృష్ణతో చేయడం ఇష్టం లేకనే అమ్మడు ఆ రేంజ్ రెమ్యునరేషన్ చెప్పిందని అనుకున్నారు. కాజల్ తర్వాత ఆ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం రాశి ఖన్నాని అడిగారట. ఆమె కూడా వెటరన్ హీరోతో చేయడం ఇష్టం లేదని అన్నదట.

 

వీళ్లకు బాలకృష్ణ రేంజ్ తెలియక ఆయనతో నటించడానికి ఇష్టం లేదంటున్నారా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కాజల్ వరకు ఓకే కాని అబ్బాయ్ తో జై లవ కుశలో జోడీ కట్టిన రాశి ఖన్నా బాలకృష్ణకు జోడీ కుదరదని అంటున్నారు. కాజల్, రాశి ఖన్నా ఇద్దరు బాలయ్య ఆఫర్ రిజెక్ట్ చేయడంతో ఆ ఛాన్స్ అంజలి అందుకుంది. కెరియర్ లో వెనుకపడ్డ అంజలి బాలకృష్ణ సినిమాతో మళ్లీ తన సత్తా చాటాలని చూస్తుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: