టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తే.. అబ్బో ఈ ఇద్దరి కాంబోలో సినిమానా అదిరిపోద్ది కదా అంటారు. అంతకుముందు మహేష్, విజయ్ కాంబో సినిమా సౌత్ క్రేజీ డైరక్టర్ మణిరత్నం ప్రయత్నించాడు కాని అప్పుడు వారి వారి ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండటం వల్ల మణిరత్నం ఆఫర్ ను తోసిపిచ్చారు. విజయ్, మహేష్ లతో అనుకున్న పొన్నియన్ సెల్వన్ సినిమాను విక్రం, కార్తిలతో చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక విజయ్, మహేష్ లు అనవసరంగా ఈ సినిమా ఎందుకు మిస్సయ్యామా అనుకునేలా చేస్తారేమో చూడాలి.

 

ఇక ఇదిలాఉంటే తెలుగు, తమిళ బైలింగ్వల్ గా మహేష్, విజయ్ లతో కలిసి ఓ సినిమా చేస్తే కచ్చితంగా రికార్డులు బద్ధలు కొట్టడం ఖాయం. ఆ విధంగా దర్శక నిర్మాతలు ఆలోచిస్తే బెటర్ అని అంటున్నారు. మహేష్ మేనరిజం, స్టైల్ సేం టూ సేం తమిళంలో విజయ్ కూడా అలానే చేస్తాడు. తెలుగులో ఇమేజ్ కోసం విజయ్ చేస్తున్న ప్రయత్నాలన్ని విఫలమవుతున్నాయి. మహేష్ తో సినిమా చేస్తే ఆ సినిమా తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంటుంది.

 

ఇంతకీ మహేష్, విజయ్ కాంబోలో మల్టీస్టారర్ వస్తే ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అంటే తమిళంలో అయితే మురుగదాస్, శంకర్ లు.. తెలుగులో రాజమౌళి, సుకుమార్ లాంటి స్టార్ డైరక్టర్స్ అయితే బెటర్ అని అంటున్నారు. మహేష్ విజయ్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన ఆలోచనే ఉత్సాహపరుస్తుంటే వీళ్లు కలిసి సినిమా చేస్తే ఇంకెలా ఉంటుందో చూడాలి.                                       

మరింత సమాచారం తెలుసుకోండి: