చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియకపోయినా దర్శకుడు సుజిత్ మాత్రం చిరంజీవితో తాను తీయబోతున్న ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ పనులను పరుగులు తీయిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి స్క్రిప్ట్ విషయంలో అనేక మార్పులు చేర్పులు చేసిన సుజిత్ ఇప్పుడు ఈ సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన నటీనటుల ఎంపిక పై చిరంజీవి సలహాలు అడుగుతున్నట్లు తెలుస్తోంది.


‘లూసిఫర్’ మూవీలో అత్యంత కీలక పాత్ర అయిన మంజూ వారియర్ పాత్రను తెలుగులో ఎవరిచేత నటింప చేస్తే బాగుంటుంది అన్న విషయమై  సుజిత్ కు రెండురకాల ఆలోచనలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంజూవారియర్ పాత్రను తెలుగులో నటించే హీరోయిన్ కు మంచి ఇమేజ్ తో పాటు నటనా సామర్ధ్యం ఉండాలి కాబట్టి అత్యంత క్లిష్టమైన ఈ పాత్రకు విజయశాంతి తో కానీ లేదంటే సుహాసినీ చేత కాని నటింపచేయాలని సుజిత్ ఆలోచన అని అంటున్నారు.


ఇప్పుడు ఈ ఆలోచనలు సుజిత్ చిరంజీవి దృష్టి వరకు తీసుకువెళ్ళడంతో ఈపాత్రకు వీరిద్దరితో పాటు ఖుష్బూ ను కూడ సంప్రదిస్తే బాగుంటుంది కదా అని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సుజిత్ మాత్రం మంజూవారియర్ పాత్రకు సరైన న్యాయం చేయగల సామర్థ్యం విజయశాంతి సుహాసినీ లకు మాత్రమే ఉందని చిరంజీవితో తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.


వాస్తవానికి చిరంజీవికి పైన పేర్కొన్న ఆనాటి ముగ్గురు హీరోయిన్స్ తో మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో పారితోషిక విషయంలో పెద్దగా పట్టుపట్టకుండా సహకరించే హీరోయిన్ కోసం చిరంజీవి ఆలోచనలు ఉన్నాయి అని అనిఅంటున్నారు. ‘లూసిఫర్’ మూవీ రాజకీయ నేపధ్యంతో ఉండే సినిమా కాబట్టి ఈమూవీలోని డైలాగ్స్ కాని సన్నివేశాలు కాని ఏ ప్రముఖ రాజకీయ పార్టీని టార్గెట్ చేసివిగా లేకుండా చూసుకోమని చిరంజీవి సుజిత్ కు చెపుతున్న పరిస్థితులలో అలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం సాదాసీదాగా తీస్తే ఈ మూవీ కూడ తన గత సినిమా ‘సాహో’ లానే ఫెయిల్ అయితే పరిస్థితి ఏమిటి అంటూ చిరంజీవి మాటలకు ఎదురు చెప్పలేక సుజిత్ సతమతమైపోతున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: